ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసంలోని( Karthika Masam ) ప్రతి రోజుకు ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు.మారి ఆ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి ఏకాదశిగా పేరు ఉన్న ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహా విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని పండితులు చెబుతున్నారు.చాతుర్మాస వ్రతం ప్రారంభించిన తొలి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి తో ముగుస్తుంది.
భీష్మ పితామహుడు మహాభారత యుద్ధంలో ఈ ఏకాదశి రోజునే అస్త్రసన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు.యజ్ఞవల్క్య మహర్షి ఈ రోజునే జన్మించాడు.
కార్తీక శుద్ధ ఏకాదశి( Kartika Suddha Ekadashi ) రోజున బ్రహ్మాది దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, యోగులు, సిద్ధులు మొదలైన వారు విష్ణు లోకం చేరుకొని కీర్తనలతో, భజనలతో కర్పూర హారతులతో మహావిష్ణువును మేల్కొలుపుతారనీ నిపుణులు చెబుతున్నారు.

విష్ణువుకు హారతి ఇవ్వడం వల్ల అకాలమృత్యు దోషం తొలగిపోతుందని కూడా చెబుతున్నారు.విష్ణువుకు హారతి ఇవ్వడం కుదరని పక్షంలో ఆలయానికి వెళ్లి స్వామివారికి ఇచ్చే హారతిని చూడాలి.స్వామికి హారతి కర్పూరం సమర్పించాలి.
బ్రహ్మదేవుడికి నారద మహర్షికి మధ్య జరిగిన ఏకాదశి మహత్యాన్ని గురించి ఈ విశేషాలు స్కందా పురాణంలో ఉన్నాయి.కార్తిక శుద్ధ ఏకాదశి వ్రతం సర్వ పాపాలను హరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఏకాదశి వ్రతం చేసిన వారు ఒకరికి అన్నదానం చేయడం వల్ల సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యఫలితం లభిస్తుందని చెబుతున్నారు.దక్షిణ తాంబూలాన్ని పండితులను దానం చేయడం వల్ల ఈ లోకంలోనే కాకుండా మరణం తర్వాత కూడా సుఖాలను పొందవచ్చు అని చెబుతున్నారు.

కార్తిక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువు ( Lord Vishnu )పూజించి,రాత్రి జాగరణ చేసి ద్వాదశి గడియలు ఉండగానే శ్రీమహావిష్ణువు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి.ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానం కలగడంతో పాటు సర్వపాప పరిహారం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞాలు, యాగాలు, వేదం చదవడం వల్ల కలిగే పుణ్యానికి కోటి రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుందని బ్రహ్మ దేవుడు నారద మహర్షితో తెలిపాడు.అలాగే ఏకాదశి రోజు ఉపవాసం చేసి ఏదైనా మంచి పని చేసినా అది సుమారు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుందని పండితులు చెబుతున్నారు.