మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో ఐరన్( Iron ) ముందు వరుసలో ఉంటుంది.ఐరన్ అనేది శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేసే ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్( Hemoglobin ) అనే ప్రోటీన్‌ను తయారు చేయడానికి ఉపయోగించే ఒక ఖనిజం.
దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో దాదాపు సగానికి పైగా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.ఐరన్ లోపం కారణంగా రక్తహీనత ఏర్పడుతుంది.
అలాగే చర్మం పాలిపోవడం, అలసట, బలహీనత, ఏకాగ్రత దెబ్బతినడం, వేగవంతమైన హృదయ స్పందన రేటు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ ను అందించాలి.
అయితే ఐరన్ అనగానే పండ్లలో అందరికీ మొదట గుర్తుకు వచ్చేది దానిమ్మ( Pomegranate ).దానిమ్మలో ఇనుము పుష్కలంగా ఉంటుంది.రోజుకొక దానిమ్మ పండును తింటే ఐరన్ లోపం తగ్గుతుందని అంటుంటారు.అది నిజమే.కానీ దానిమ్మలో మాత్రమే కాదు ఇప్పుడు చెప్పబోయే పండ్లలో కూడా ఐరన్ రిచ్ గా ఉంటుంది.ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సిన ఫ్రూట్ యాపిల్( Apple ).అధిక ఐరన్ కంటెంట్ మరియు విటమిన్ సి కి యాపిల్స్ ప్రసిద్ధి చెందాయి.రక్తహీనతతో బాధపడే వారికి యాపిల్ చక్కటి ఎంపిక.
రోజుకు ఒక యాపిల్ తింటే శరీరానికి ఐరన్ అంది హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.దీంతో రక్తహీనత దూరం అవుతుంది.
అలాగే ఐరన్ రిచ్ గా ఉండే పండ్లలో జామ ( Guava )ఒకటి.చౌక ధరకే లభించే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పండు ఇది.తరచూ జామను తీసుకుంటే ఐరన్ కొరత దూరం అవుతుంది.రోగనిరోధక శక్తి పెరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు సైతం అదుపులో ఉంటాయి.
డ్రాగన్ ఫ్రూట్( Dragon fruit ) లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.డ్రాగన్ ఫ్రూట్ ను డైట్ లో చేయించుకోవడం ద్వారా ఐరన్ కొరతను జయించవచ్చు.
అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఎముకలను బలోపేతం చేస్తుంది.ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం మరియు గోళ్లకు మద్దతు ఇస్తుంది.ఇక అవోకాడో, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, ఖర్జూరం, అత్తి పండ్లలో కూడా ఇనుము అధికంగా ఉంటుంది.కాబట్టి ఐరన్ లోపంతో బాధపడేవారు దానిమ్మ తో పాటు ఈ పండ్లను కూడా భాగం చేసుకోండి.