మిలాద్ ఉన్ నబీ పండగ ప్రాముఖ్యత గురించి తెలుసా..?

ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషి మార్గదర్శనం కోసం అల్లాహ్ ( Allah )అన్ని కాలాలలో అన్ని జాతుల్లో తన ప్రవక్త చేశాడు.గ్రంథాలను అవతరింపజేశాడు.

 Do You Know About The Importance Of Milad Un Nabi , Milad Un Nabi , Allah, Hazra-TeluguStop.com

హజరత్ ఆదమ్ ( Hazrat Adam )మొదలు మహమ్మద్ ప్రవక్త వరకు అనేకమంది సందేశారులు ఈ భూమిపై జన్మించారు.వారందరిలో చివరి దైవ ప్రవక్త మహమ్మద్ ఆయనపై అవతరించిన చివరి గ్రంథం పవిత్ర ఖురాన్ అని దాదాపు చాలామందికి తెలుసు.

ఇక ప్రళయ కాలం వరకు ఏ ఒక్క ప్రవక్తలు రారు అలాగే గ్రంధాలు కూడా అవతరించవు.కాబట్టి ఈ భూమిపై ఉన్న ప్రజలందరూ ప్రళయ కాలం వరకు ఆయనను అనుసరించాల్సి ఉంటుంది.

మొహమ్మద్ ప్రవక్త తనంత తాను ఏమీ బోధించలేదు.మానవుల సంక్షేమం కోసం, సాఫల్యం కోసం దైవం అవతరింపజేసిన హితోపదేశాలనే ఆయన ఈ భూమిపై ఉన్న ప్రజలకు అందజేశారు.

మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశలలో వివిధ రంగాలలో ఎలా జీవించాలో ఆయన తెలిపారు.ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు 1450 సంవత్సరాలు క్రితం అరేబియా దేశంలోని మక్కా నగరంలో మొహమ్మద్ ప్రవక్త ( Muhammad pravktha )జన్మించారు.

అమీనా, అబ్దుల్లా దంపతులకు ప్రవక్త జన్మించారు పుట్టకముందే తండ్రిని, ఆరెళ్ళ తర్వాత తల్లిని కూడా కోల్పోయారు.

Telugu Abdullah, Allah, Amina, Bakthi, Bhakti, Devotional, Hazrat Adam, Milad Na

చిన్నతనం నుంచి ఆయన తాతయ్య పెంచి అనేక సుగుణాలను నేర్పించారు.మొహమ్మద్ ప్రవక్త కొన్ని విలువైన సూచనలను ప్రజలకు సూచించారు.అప్పటి సమాజంలో మహిళలను ఒక విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు.

అలాంటి జాతిని అన్ని విధాల సంస్కరించి వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత మహమ్మద్ ప్రవక్తకే దక్కింది.అలాగే ఎలాంటి పరిస్థితిలోనైనా నీతిని న్యాయాన్ని వదలకూడదు అని చెప్పారు.

అనాధలను, వృద్ధులను ఆదరించాలనీ, తల్లిదండ్రులను సేవించాలనీ చెప్పారు.

Telugu Abdullah, Allah, Amina, Bakthi, Bhakti, Devotional, Hazrat Adam, Milad Na

ధనాన్ని దుబారాగా ఖర్చు చేయకూడదని ప్రవక్త వెల్లడించారు. వ్యభిచారం కోసం వెళ్లకూడదని వెల్లడించారు.నిష్కారణంగా ఏ ప్రాణికి హాని తలపెట్టకూడదని సూచించారు.ప్రతి తల్లిదండ్రులు తమ సంతానానికి విద్య నిర్మించాలని వెల్లడించారు.అజ్ఞాన కాలపు దుర్మార్గాలన్నిటినీ నేను అంతం చేస్తాను, అని ప్రవక్త ఆ సమయంలోనే వెల్లడించారు.మానవులంతా ఒక్కటే విద్యార్జన మహిళల, పురుషుల అందరి విధి అని వెల్లడించారు.జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణం అని ఆయన సూచించారు.

కళ్ళు ఉన్నవారు, గుడ్డివాళ్ళు సమానమే.జ్ఞాన సంపన్నులు, జ్ఞానవిహీనులు సమానం కాలేరు అని ప్రవక్త వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube