దిష్టి గురించి పెద్దవారు ఎప్పుడూ చెప్పే మాట, నరదృష్టి( Nara drishti ) కి నాపరాళ్లయినా పగులుతాయని.దిష్టికి అంతా శక్తి ఉందట మరి.
ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలామంది పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు.మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉండి దాని ప్రభావం ఉంటుందని చాలా మంది ప్రజల నమ్మకం.
ఈర్ష, ద్వేషంతో చూసే చూపుకు, చేసే ఆలోచనకు కూడా కొంత బలం ఉంటుంది.ఇది చెడు ప్రభావం పడేట్టు చేయగలుగుతుంది.ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపుని చెడు దిష్టి అని పిలుస్తారు.చెడు దిష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతకు కారణమవుతుంది.
దీని వల్ల అనేక రకాలు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.ముఖ్యంగా దిష్టి తగిలినప్పుడు ఏం జరుగుతుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అని ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టిన సరే ఆటంకాలు ఎదురవుతుంటాయి.అనుకున్న పని ఏది పూర్తి కాదు.ఇంకా చెప్పాలంటే దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు( Health ) గురవుతూ ఉంటాడు.దిష్టి తగిలిందని చెప్పేందుకు సంకేతాలు ప్రశాంతంగా ఉండలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అనవసరంగా గాబరబడడం, ఏకాగ్రత లేకపోవడం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలు.

దిష్టి వల్ల ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యం మారిన పడుతూ ఉంటే, సముద్రపు నీటిని ఒక శుభ్రమైన బట్టతో వడగట్టి అందులో గోమూత్రం కలిపి ఒక సీసాలో నిలువ చేసి పెట్టుకోవాలి.ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పౌర్ణమి రోజున( Pournami ), పాండ్యామి రోజున ఇంట్లోని అన్ని గదుల్లో కొద్ది కొద్దిగా చల్లాలి.ఇలా చేస్తే ఇంటికి తగిలిన దిష్టి పోతుంది.పసి పిల్లలు ఇంటికి ఎవరైనా వచ్చినా వచ్చి వెళ్లిన తర్వాత ఎడతెగకుండా ఏడుస్తూ ఉంటే ఉప్పు చేతిలోకి తీసుకొని వారి తల చుట్టూ క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ మూడుసార్లు తిప్పి ఉప్పు నీటిలో వెయ్యాలి.
గర్భవతులకు దిష్టి తగలకుండా ఉండేందుకు బయటకు వెళ్ళినప్పుడు రెండు వేపాకులను వెంట తీసుకొని వెళ్ళాలి.ఇంటికి తిరిగి రాగానే వాటిని కాల్చేయ్యాలి.ఇలా చేస్తే నర దిష్టి దూరమైపోతుంది.