బ్రహ్మ హత్యాపాతకం అంటే ఏంటి..? ఆ పాతకం తొలిగిపోవాలంటే ఏం చేయాలి..?

స్త్రీ హత్య, శిశు హత్య, గో హత్య, బ్రహ్మ హత్య, గురు పత్నీ సాంగత్యం వీటిని పంచ మహా పాతకములు అంటారు.అంటే అత్యంత పెద్ద పాపాలు అని అర్థం.

 Brahma Hatya Patham Means What What To Do To Get Rid Of It , Brahma Hatya Patham-TeluguStop.com

ఈ పాపాలకు పాల్పడిన వారికి వాటి పాప కర్మలు చాలా ఘోరంగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.ఈ పాతకాలకు పాల్పడిన వారు వాటి కర్మల నుండి బయట పడేందుకు ఎన్నో పుణ్య కార్యాలు చేయాల్సి ఉంటుంది.

వీటిలో బ్రహ్మ హత్య కూడా ఒకటి.బ్రాహ్మణుడు లేదా బ్రహ్మ నిష్ఠుడు అయిన వారిని చంపితే బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంటుంది.

ఇది ప్రాచీన కాలంలో ఇతరులను హత్య చేయడం కంటే ఘోరమైన నేరంగా భావింప బడింది.

ఈ పాపానికి పూనుకున్న వారు పాప విముక్తి పొందడానికి కొన్ని మార్గాలు నిర్దేశింపబడి ఉన్నాయి.

అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకుని పన్నెండు సంవత్సరాలు అందులో ఉంటూ తపస్సు చేయాలి.లేదా శివ శిరోధ్వజం అన్న భిక్షాపాత్రను తయారు చేసుకుని భిక్ష అర్థిస్తూ పర్యటించాలి.

లేదా అశ్వమేథం, స్వర్ణిద్యాగం, లేక గోస వనం అనే మూడు యాగాల్లో ఒకటి అనుష్ఠించాలి. ఇదేదీ సాధ్యం కాకపోతే తన యావదాస్తినీ వేద విదుడైన విప్రునికి ఇవ్వాలి.

ఇట్టి ప్రాయశ్చిత్తాలలో ఏదైనా ఒకటి చేసిన వాడు బ్రహ్మ హత్య పాతకం నుండి విముక్తుడు అవుతాడని పురాణాల్లో చెప్పారు.తర్వాతి కాలంలో ఈ పాప నివృత్తికి నానా ప్రాయశ్చిత్తాలు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube