ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు చిన్న వయసులోనే గుండె సమస్యల వల్ల గుండెపోటు రావడం వల్ల చనిపోతున్నారు.ఇంకా చెప్పాలంటే అధిక కొవ్వు వల్ల చిన్న నుంచి పెద్దవారి వరకు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు.
అందువల్లే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఎక్కువగా గుండెపోటు సమస్యల భారినపడి చాలామంది జనాలు చనిపోతున్నారు.కొంతమంది పెళ్లి బారాతులలో, మరికొంతమంది డీజే డాన్సులు చేస్తూ, మరికొంతమంది ఏదో కూర్చుని కూర్చున్నట్లుగా గుండెపోటుతో కుప్పకూలి మరణించడం ప్రజలలో ఆందోళన కలిగించే విషయం.
మనదేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలకు ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏమి జరిగినా సోషల్ మీడియా కారణంగా ప్రజలందరికీ తెలిసిపోతోంది.
ఒక సాయి బాబా దేవాలయంలో దేవునిని ప్రార్థిస్తూ ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.మధ్యప్రదేశ్ లోని కత్ని జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
సాయి బాబా పాదాలకు దండం పెడుతూ అలాగే కూర్చుని ఒక వ్యక్తి కాసేపటి వరకు చలనం లేకుండా ఉండిపోయాడు.అప్పటికి కొంతమంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్లిపోతున్నా కూడా ఆ వ్యక్తి కదలకుండా ఉండిపోయాడు.
ఇంకా ఎంతసేపటికి ఆ వ్యక్తి కదలకపోవడం వల్ల అనుమానం వచ్చి కొందరు ఆయనను కదిలించి చూశారు.ఉన్నట్టుండి ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు.అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని అక్కడ ఈ ప్రజలు తెలుసుకున్నారు.బాబా పాదాలపై తలపెట్టి అట్లాగే గుండెపోటుతో ప్రాణాలను వదిలాడని తర్వాత తెలిసింది.ఆ వ్యక్తి అంత సేపు ఒక్కడే ఉన్న గమనించిన ప్రజలు దండం పెట్టుకుంటున్నాడు ఏమో అని మిగతా భక్తులందరూ అనుకున్నారు.ఒక్కసారి కదిలిస్తే కానీ తెలియలేదు ఆయన చనిపోయినట్టు.
బాబా కాళ్ళ దగ్గర నుంచి చనిపోవడం అదృష్టమని, అతనికి మోక్షం లభిస్తుందని బాబా భక్తులు చెబుతున్నారు.ఇటీవల రామ్ లీలా మైదానంలో ఒక వ్యక్తి నాటకం చేస్తూ మధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు.
ఇంకొక ఘటనలో ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ తన వివాహంలోనే ఉన్నట్టుండి కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
DEVOTIONAL