ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.39
సూర్యాస్తమయం: సాయంత్రం 06.15
రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు ఎదురవుతాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేయాలి.
వృషభం:
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది.తొందరపడి ఎటువంటి ఆలోచనలు చేయకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఈ రోజు సంతోషం ఉంటారు.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
సింహం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కన్య:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటుంది.
తులా:
ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.విశ్రాంతి లేకుండా పోతుంది.దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీపై ఆధారపడి ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.
ధనస్సు:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల ఒత్తిడికి లోనవుతారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కొత్తవిషయాలు నేర్చుకుంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.
మకరం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.భవిష్యత్తులో ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఓ శుభకార్యంలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకపోవడం మంచిది.
కుంభం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి బాధపడాల్సి వస్తుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంది.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
దూర ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.
కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
LATEST NEWS - TELUGU