Coca-Cola : ఒక్క పాటతో కోకాకోలా కంపెనీ మూత పడాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది ?

తీసుకో కోకోకోలా…ఏస్కో రొమ్ము సారా… ఈ పాట ఈ జనరేషన్ వారికి గుర్తుండే ఛాన్స్ లేదు గానీ కాస్త వెనక్కి వెళితే అప్పట్లో ఇది కుర్ర కారును పిచ్చెక్కించింది.టీవీల్లో ఈ పాట వస్తే చాలు ఇంట్లో ఆడ వరకు కోపంతో టీవీ ఆపేసేవారు.

 Rowdeelaku Rowdy Tesko Coca Cola Song Controversy Details-TeluguStop.com

జ్యోతిలక్ష్మి( Jyothi Lakshmi ) వయ్యారాలు పోతూ ఈ పాటలు నృత్యం చేసిన తీరుకు యావత్ తెలుగు ప్రపంచం మోకరిల్లింది.అయితే ఈ పాట యువతకు నచ్చినట్టుగా ఆడవారికి నచ్చే అవకాశం లేదు.

అందుకే ఆ పాట వచ్చిన సారి ఏదో మహా పాపం జరిగిపోయినట్టు చూస్తూ ఉండేవారు.అయితే ఈ ఒక్క పాట వల్ల కోకో కోలా కంపెనీ అమ్మకాలు దారుణంగా పడిపోయాయట అప్పట్లో.

దానికి సంబంధించిన కహానీ ఏంటో ఒకసారి చూద్దాం.

Telugu Jyothilaxmi, Rowdeelakurowdy, Tesko Coca Cola, Teskococa-Movie

1971లో రౌడీలకు రౌడీ( Rowdeelaku Rowdy ) అనే ఒక సినిమా విడుదల అయింది.ఇందులో విజయ లలిత, రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు.అప్పట్లో వ్యాంపు పాటలు వేరు మిగతా పాటలు వేరుగా ఉండేవి.

ఇప్పుడు అంటే హీరోయిన్స్ అన్ని తామై చుట్టేస్తున్నారు.ఐటీజే ఈ కోకోకోలా పాట( Coca Cola Song ) విషయానికి వస్తే ఒక క్లబ్ సాంగ్ గా విడుదలయ్యింది.

ఎల్ ఆర్ ఈశ్వరి పాడిన ఈ పాటకు ఆరుద్ర లిరిక్స్ రాసి పెట్టారట.మొత్తానికి ఈ పాట విడుదల అయింది.

ఈ సినిమా కూడా అద్భుతంగా హిట్ అయింది.మీరు పోస్టర్స్ కనక ఓసారి గూగుల్ లో కొట్టి చూడండి.

జ్యోతిలక్ష్మిని ప్రధాన పాత్రలో పెట్టి విజయలలిత రామకృష్ణ ఫోటోలు చిన్నగా వేసి పోస్టర్స్ ప్రింట్ చేశారు అప్పట్లో.

Telugu Jyothilaxmi, Rowdeelakurowdy, Tesko Coca Cola, Teskococa-Movie

అంతలా ఈ పాట ప్రభావాన్ని చూపించింది అప్పట్లో.అయితే ఈ సినిమా విడుదలయ్యాక ఆ పాటను విన్న వారంతా కోకోకోలా అంటే అదేదో ఒక వ్యాంపు పాడింది కాబట్టి విష పదార్థం అనుకున్నారో ఏంటో అర్థం కాలేదు కానీ ఉన్నపలంగా ఆ కంపెనీ నమ్మకాలు తగ్గిపోయాయి అంట.వ్యాంపు పాత్రలు చేసే వారిని చాలా తక్కువగా చూసేవారు అప్పట్లో.దాన్ని దృష్టిలో పెట్టుకొని కోకోకోలని కూడా బ్యాన్ చేయడం( Coca-Cola Ban ) మొదలుపెట్టారు.దాదాపు 10 ఏళ్ల పాటు ఆ కంపెనీ కొలుకోలేదట.అలా కేవలం ఒక పాట కారణంగా కోకో కోలా కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ లో మూతపడే స్థాయికి వచ్చింది అంటే ఆ సినిమాలోని పాట ప్రభావం ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube