Coca-Cola : ఒక్క పాటతో కోకాకోలా కంపెనీ మూత పడాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది ?

తీసుకో కోకోకోలా.ఏస్కో రొమ్ము సారా.

ఈ పాట ఈ జనరేషన్ వారికి గుర్తుండే ఛాన్స్ లేదు గానీ కాస్త వెనక్కి వెళితే అప్పట్లో ఇది కుర్ర కారును పిచ్చెక్కించింది.

టీవీల్లో ఈ పాట వస్తే చాలు ఇంట్లో ఆడ వరకు కోపంతో టీవీ ఆపేసేవారు.

జ్యోతిలక్ష్మి( Jyothi Lakshmi ) వయ్యారాలు పోతూ ఈ పాటలు నృత్యం చేసిన తీరుకు యావత్ తెలుగు ప్రపంచం మోకరిల్లింది.

అయితే ఈ పాట యువతకు నచ్చినట్టుగా ఆడవారికి నచ్చే అవకాశం లేదు.అందుకే ఆ పాట వచ్చిన సారి ఏదో మహా పాపం జరిగిపోయినట్టు చూస్తూ ఉండేవారు.

అయితే ఈ ఒక్క పాట వల్ల కోకో కోలా కంపెనీ అమ్మకాలు దారుణంగా పడిపోయాయట అప్పట్లో.

దానికి సంబంధించిన కహానీ ఏంటో ఒకసారి చూద్దాం. """/"/ 1971లో రౌడీలకు రౌడీ( Rowdeelaku Rowdy ) అనే ఒక సినిమా విడుదల అయింది.

ఇందులో విజయ లలిత, రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు.అప్పట్లో వ్యాంపు పాటలు వేరు మిగతా పాటలు వేరుగా ఉండేవి.

ఇప్పుడు అంటే హీరోయిన్స్ అన్ని తామై చుట్టేస్తున్నారు.ఐటీజే ఈ కోకోకోలా పాట( Coca Cola Song ) విషయానికి వస్తే ఒక క్లబ్ సాంగ్ గా విడుదలయ్యింది.

ఎల్ ఆర్ ఈశ్వరి పాడిన ఈ పాటకు ఆరుద్ర లిరిక్స్ రాసి పెట్టారట.

మొత్తానికి ఈ పాట విడుదల అయింది.ఈ సినిమా కూడా అద్భుతంగా హిట్ అయింది.

మీరు పోస్టర్స్ కనక ఓసారి గూగుల్ లో కొట్టి చూడండి.జ్యోతిలక్ష్మిని ప్రధాన పాత్రలో పెట్టి విజయలలిత రామకృష్ణ ఫోటోలు చిన్నగా వేసి పోస్టర్స్ ప్రింట్ చేశారు అప్పట్లో.

"""/"/ అంతలా ఈ పాట ప్రభావాన్ని చూపించింది అప్పట్లో.అయితే ఈ సినిమా విడుదలయ్యాక ఆ పాటను విన్న వారంతా కోకోకోలా అంటే అదేదో ఒక వ్యాంపు పాడింది కాబట్టి విష పదార్థం అనుకున్నారో ఏంటో అర్థం కాలేదు కానీ ఉన్నపలంగా ఆ కంపెనీ నమ్మకాలు తగ్గిపోయాయి అంట.

వ్యాంపు పాత్రలు చేసే వారిని చాలా తక్కువగా చూసేవారు అప్పట్లో.దాన్ని దృష్టిలో పెట్టుకొని కోకోకోలని కూడా బ్యాన్ చేయడం( Coca-Cola Ban ) మొదలుపెట్టారు.

దాదాపు 10 ఏళ్ల పాటు ఆ కంపెనీ కొలుకోలేదట.అలా కేవలం ఒక పాట కారణంగా కోకో కోలా కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ లో మూతపడే స్థాయికి వచ్చింది అంటే ఆ సినిమాలోని పాట ప్రభావం ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ ఇయర్ లో భారీ విజయాలను సాదించిన టాప్ 3 ఇండియన్ సినిమాలు ఇవేనా..?