విజయ్ దేవరకొండ కోసం ఇద్దరు దర్శకులు వెయిటింగ్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి సినిమా చేస్తుండగా ఆ తర్వాత ప్రాజెక్ట్ పూరీ డైరక్షన్ లోనే జన గణ మన ఫిక్స్ చేసుకున్నాడు.

 Two Top Directors Waiting For Vijay Devarakonda , Indraganti Mohanakrishna, Jgm,-TeluguStop.com

ఈ రెండు ప్రాజెక్ట్ ల తర్వాత సుకుమార్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడో ఎనౌన్స్ చేశారు.కానీ ఇప్పటివరకు ఆ సినిమా అప్డేట్ రాలేదు.

పుష్ప 2 తర్వాత సుకుమార్ దాదాపు వీయ్ దేవరకొండతోనే సినిమా చేస్తారని తెలుస్తుంది.

సుకుమార్ మాత్రమే కాదు విజయ్ దేవరకొండతో సినిమా కోసం మరో సక్సెస్ ఫుల్ డైరక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కూడాఅ వెయిటింగ్ లో ఉన్నారు.

సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తున్న ఇంద్రగంటి మోహనకృష్ణ తన నెక్స్ట్ సినిమాని విజయ్ దేవరకొండతో ప్లాన్ చేస్తున్నారు.విజయ్ కూడా అతని డైరక్షన్ లో చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

కానీ సుకుమార్ లైన్ లో ఉన్నాడు కాబట్టి సుకుమార్ తర్వాత ఇంద్రగంటికి ఛాన్స్ ఇస్తాడని టాక్.మొత్తానికి విజయ్ వరుస క్రేజీ సినిమాలతో తన సత్తా చాటుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube