తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొంది.నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగిసింది.
ఐతే అన్ని పార్టీల అభ్యర్థులు సాధ్యమైనంత వరకు పట్టభద్రుల మద్దతును పొందడానికి చేయవలసిన ప్రయత్నాలు అన్ని చేశారు.అయితే సాధారణంగా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు వాటికి అంతగా ప్రచారం కల్పించలేదు.
కాని ఈసారి ప్రతి ఒక్క పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అయితే ఈసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓడిపోతే టీఆర్ఎస్ పార్టీపై రాష్ట్రమంతా వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉంది.
అయితే ఈ రకమైన ప్రచారం టీఆర్ఎస్ పార్టీకి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది.ఎందుకంటే త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
అయితే పట్టభద్రుల మదిలో ఏమున్నది, వారు ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారన్నది తెలియాలంటే మనం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.అయితే టీఆర్ఎస్ పై పట్టభద్రులు ఆగ్రహంగా ఉన్నారనేది ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది.
ఇప్పటివరకు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, అలాగే ఉద్యోగ నియామకాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పట్టభద్రులు తీర్పునిచ్చే అవకాశం ఉన్నట్లు రకరకాల సర్వేల ద్వారా తెలుస్తోంది.