ఎమోషనల్ పోస్ట్ చేసిన సితార.. నాన్నమ్మ తిరిగి రావాలంటూ?

సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందిన సంగతి తెలిసిందే.నాన్నమ్మ మరణవార్త తెలిసి సితార వెక్కివెక్కి ఏడ్చగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

 Sithara Emotional Post Goes Viral In Social Media Details, Sithara, Sithara Emot-TeluguStop.com

అయితే నాన్నమ్మను తలచుకుంటూ సితార ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.నిన్న మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగాయి.

సితార తన పోస్ట్ లో మిస్ యూ సో మచ్ నాన్నమ్మ.నువ్వు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.సితార చేసిన ఎమోషనల్ పోస్ట్ చూసి నెటిజన్లు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు.హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో సితార ఈ పోస్ట్ ను షేర్ చేయడం గమనార్హం.

 Sithara Emotional Post Goes Viral In Social Media Details, Sithara, Sithara Emot-TeluguStop.com

నాన్నమ్మ అంటే సితారకు ఎంతో ఇష్టమని సితార పోస్ట్ ల ద్వారా అర్థమవుతోంది.నాన్నమ్మతో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ సితార ఈ కామెంట్లు చేశారు.

సితార ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా అమ్మమ్మతో గడపడానికి సమయం కేటాయించేవారని సమాచారం.

మహేష్ కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడగా మహేష్ ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొనడం కష్టమని తెలుస్తోంది.మహేష్ కెరీర్ లో సక్సెస్ కావడం విషయంలో తల్లి పాత్ర ఎంతో ఉంది.

వరుస విషాదాలు కృష్ణ కుటుంబ సభ్యులను సైతం ఎంతగానో బాధిస్తున్నాయని బోగట్టా.నిన్న జరిగిన ఇందిరా దేవి అంత్యక్రియలకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.పలువురు సినీ ప్రముఖులు సైతం ఇందిరా దేవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఇందిరా దేవి మరణం నిజం కాకపోతే బాగుండేదని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube