జాంబియాలో ఉల్లాసంగా గడిపిన కమలా హారిస్.. పొలంలో సందడి , ఫోటోలు వైరల్

అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్( US Vice President Kamala Harris ) ప్రస్తుతం జాంబియా ( Zambia ) పర్యటనలో వున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో శనివారం గ్లోబల్ వార్మింగ్‌ను( Global Warming ) ఎదుర్కొంటూనే ఆహార సరఫరాలను భద్రపరుస్తున్న మార్గాలను ఆమె పరిశీలించారు.

జాంబియా రాజధాని వెలుపల వున్న ఓ పొలంలో ఉల్లాసంగా గడిపిన ఆమె.కూరగాయల పంటను పెంచడంలో కొత్త పద్ధతులు, సాంకేతికతను తెలుసుకున్నారు.ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న ధరల పెరుగుదల, ఆహార సంక్షోభం పేద దేశాలకు హాని కలిగిస్తున్నాయని కమలా హారిస్ అన్నారు.

దీనికి తోడు రాబోయే రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి మరిన్ని సవాళ్లను తీసుకురావొచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు.ఆకలి కూడా సమాజంలో అస్ధిరతను సృష్టించడంతో పాటు వలసలు , సంఘర్షణలకు దారి తీస్తుందని కమలా హారిస్ అన్నారు.

కాగా.వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆఫ్రికాను సిద్ధం చేయడానికి, ఆయా దేశాలకు సాయం చేసే లక్ష్యంతో కమలా హారిస్ పర్యటన సాగుతోంది.ఇక్కడ ఆహార ఉత్పత్తిని మెరుగుపరచడంతో పాటు ప్రైవేట్ రంగంలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని అమెరికా భావిస్తోంది.

Advertisement

జాంబియా కంటే ముందు ఘనా , టాంజానియాలలో కమలా హారిస్ పర్యటించారు.చైనా ప్రభావం ఎక్కువగా వున్న ఈ ప్రాంతంలోకి అమెరికా చొచ్చుకెళ్లాలనే లక్ష్యంతో ఆమె పర్యటన ఉద్దేశించబడింది.

ఆఫ్రికన్ పార్క్స్ అనే పరిరక్షణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు రాబోయే ఏడేళ్లలో 1.25 బిలియన్లను సమీకరించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది.మరో సంస్థ వన్ ఎకర్ ఫండ్ సైతం ఈ దశాబ్ధం చివరి నాటికి 1 బిలియన్ చెట్లను నాటడానికి 100 మిలియన్లను సేకరించాలని యోచిస్తోంది.

ఆఫ్రికాలో ప్రస్తుతం వాతావరణ మార్పులు, రాజకీయాలు సంక్లిష్టంగా వున్నాయి.అయితే అమెరికా వంటి ధనిక దేశాలతో పోలిస్తే ఇక్కడ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తక్కువగానే వెలువడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం.2021లో 43 శాతం ఆఫ్రికన్లకు విద్యుత్తు అందుబాటులో లేదు.ఆఫ్రికాలో వృద్ధిని సాధించడానికి సహాయపడే ‘‘క్లీన్ ఎనర్జీ ఎకానమీ’’లో అవకాశాలు పుష్కళంగా వున్నాయని కమలా హారిస్ పేర్కొన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు