అక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు.. ఫ్యాన్స్ ఫైర్..!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్( ICC ODI World Cup ) 2023 టోర్నీ ఎటువంటి ఆరంభ వేడుకలు లేకుండానే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

అయితే ఆరంభ వేడుకల కోసం భారీగా ఏర్పాట్లు చేసి, ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు.

ఇక అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న జరిగే భారత్- పాకిస్తాన్ ( India-Pakistan )మ్యాచ్ కి బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.ఈ మ్యాచ్ వీక్షించడం కోసం దాదాపుగా ఒక లక్ష 30 వేల మంది హాజరు కాబోతున్నారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి కొంత సమయం ముందు బాణ సంచాలతో ఓ కలర్ ఫుల్ షో నిర్వహించనుంది.భారతదేశంలో ఉండే ప్రముఖ సెలబ్రిటీలైన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ), సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్, భారత మాజీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచ్ కి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు.

ఇక మ్యాచ్ ఆరంభానికి ముందు బాలీవుడ్ సింగర్ ఆరిజిత్ సింగ్( Bollywood singer Arijit Singh ) తో లైవ్ మ్యూజిక్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారని సమచారం.భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కి చాలా క్రేజ్ ఉన్నప్పటికీ.ప్రపంచ కప్ ఆరంభ వేడుకలు చేయకుండా కేవలం ఈ మ్యాచ్ కు మాత్రమే స్పెషల్ ఏర్పాట్లు చేయడం సరికాదని ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

Advertisement

బీసీసీఐ ఇలా చేస్తే కచ్చితంగా తన పరువు పోగొట్టుకోవడం ఖాయం అని ఫ్యాన్స్ చెబుతున్నారు.వరల్డ్ కప్ ప్రారంభం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మొదలుపెట్టి.కేవలం భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కి మాత్రమే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే.

ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటున్న మిగిలిన టీమ్స్ ని అవమానించడమే అవుతుంది.బీసీసీఐ కు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కి గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయాలి అనుకుంటే.

ఆ మ్యాచ్ ను వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభం మ్యాచ్ గా పెట్టాల్సింది.ఇలా టోర్నీ మొదలైన 10 రోజుల తర్వాత జరిగే మ్యాచ్ కి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం సరికాదని క్రికెట్ అభిమానులు బీసీసీఐపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు