స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్,( NTR ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడగా కొన్నిసార్లు పవన్ కు అనుకూలంగా ఫలితాలు వస్తే మరి కొన్నిసార్లు ఎన్టీఆర్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.2009 ఎన్నికల సమయంలో టీడీపీకి( TDP ) అనుకూలంగా ప్రచారం చేసిన తారక్ ఇప్పుడు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు.పొలిటికల్ గా తన గురించి ఎంత ప్రచారం జరుగుతున్నా తారక్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన( Janasena ) టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు.
అయితే ప్రచారంలో భాగంగా పవన్ కు కొంతమంది ఎన్టీఆర్ ఫోటోలను చూపించగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు ధన్యవాదాలు అని కామెంట్లు చేస్తున్నారు.పవన్ చేసిన ఆ కామెంట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు( NTR Fans ) సంతోషాన్ని కలిగించడం గమనార్హం.
పవన్, ఎన్టీఆర్ మధ్య అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురంలో( Pithapuram ) కచ్చితంగా గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు.సర్వేల ఫలితాలు సైతం పవన్ కు అనుకూలంగా ఉండగా కూటమి గెలిస్తే పవన్ నంబర్ 2 అవుతారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా హీరోలు సైతం ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ ను సైతం త్యాగం చేసి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు.
ఆయనకు అనుకూల ఫలితాలు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.