తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు ఆయన చేసే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఎందుకంటే ఆయనకి ఇంతకుముందు వరుసగా ప్లాప్ సినిమాలు అయితే వస్తున్నాయి.కాబట్టి తన రేంజ్ కి తగ్గ సక్సెస్ లు రాకపోవడంతో ఇప్పుడు ఆయన చేసే సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశ్యం తో తను ఆచితూచి ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే “రాజాగారు రాణీ వారు” అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నా రవికిరణ్ తో( Ravikiran ) ప్రస్తుతం ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాని దిల్ రాజు( Dil Raju ) నిర్మిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే విజయ్ దేవరకొండ ఇంతకుముందు ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమా చేశాడు.అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో విజయ్ చాలా వెనకబడి పోయాడు.
ఇక ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించాడు కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లోనే మరొక సినిమాని చేయాలనే ఉద్దేశ్యం తో వీళ్లు కలిసి సినిమా చేస్తున్నారు.మరి రవి కిరణ్ కూడా రాజా గారు రాణి వారు సినిమాతో మంచి విజయినందుకున్న కూడా అప్పటినుంచి ఇప్పటివరకు పెద్దగా ఆయన సినిమాలైతే చేయలేదు.కాబట్టి ఈ సినిమా స్టోరీ చాలా పకడ్బందీగా రాసుకున్నాట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా స్పాన్ కూడా చాలా పెద్దది కావడంతో విజయ్ దేవరకొండ ను ఆశ్రయించినట్లు గా తెలుస్తుంది.
మరి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి…
.