ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల కలబంద జాతులు ఉన్నాయి.ఒక్కొక్క రకం కలబందకు ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి.
ముఖ్యంగా కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.కలబంద ఆరోగ్యానికి, చర్మనికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.
ఈ కలమందను చాలామంది ప్రజలు ప్రతిరోజు వారి ఆహారంలో చేర్చుకుంటున్నారు.ఆకుపచ్చ రంగు కలబందను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలబందలలో ఎరుపు రంగు కలబందకు ప్రత్యేక స్థానం ఉంది.ఎరుపు రంగు కలబందలో విటమిన్ ఎ,విటమిన్ సి, విటమిన్ ఇ,విటమిన్ బి12 ఎక్కువగా ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే ఇందులో ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఎర్ర కలబందలో పుష్కలంగా ఉంటాయి.
ఇది కాకుండా,ఎరుపు కలబందలో ఫైటోకెమికల్స్ కూడా ఉన్నాయి.
ఎర్ర కలబందలో ఔషధ గుణాలు ఎక్కువ గా ఉంటాయి.తలనొప్పి,మైగ్రేన్‌లకు చికిత్స చేయడానికి కూడా ఎర్ర కలబందను ఉపయోగిస్తారు.
ఇంకా చెప్పాలంటే ఎరుపు కలబంద నరాల సమస్యలను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.ఎరుపు రంగు కలమంద జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడం లో ఎంతో ఉపయోగపడుతుంది.
ఎర్ర కలబందలో కొల్లాజెన్ కూడా ఉంటుంది.అంతే కాకుండా ఎరుపు కలబంద చర్మం లో వృద్ధాప్య సంకేతాలను రాకుండా చేస్తుంది.
ఇది ముడతలు, ఫైన్ లైన్లను నయం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది.పచ్చని అలోవెరా మొక్క చాలా మంది ప్రజల ఇళ్లలో కనిపిస్తుంది.ఎరుపు రంగు కలబంద మాదిరి గానే పచ్చి కలబందలో కూడా పోషకాలు , ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.ఆకుపచ్చని కలబంద వివిధ రకాల ఆరోగ్య సమస్యలు,చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది.
ప్రతిరోజు ఉదయాన్నే కలబంద రసం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి.కలబంద శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది.కలబంద గుజ్జును ముఖంపై రాయడం వల్ల మొటిమల సమస్య తగ్గిపోతుంది.