స్టార్ హీరోయిన్ హన్సిక తెలుగులో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.ప్రస్తుతం తమిళ సినిమాలలో హన్సిక ఎక్కువగా నటిస్తుండగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుండటం గమనార్హం.
హన్సికకు త్వరలో పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే.అయితే హన్సిక భర్తకు ఇప్పటికే పెళ్లైందని సమాచారం అందుతోంది.
చాలా సంవత్సరాల క్రితం హన్సిక భర్తకు పెళ్లి జరిగిందని బోగట్టా.
హన్సికకు కాబోయే భర్త పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదని హన్సిక స్నేహితురాలే అని సమాచారం అందుతోంది.
హన్సిక స్నేహితురాలిని మోసం చేసిందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఈ కామెంట్ల గురించి హన్సిక ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఇప్పటికే పెళ్లైన వ్యక్తిని హన్సిక ఎలా ప్రేమించిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
హన్సిక ఫ్రెండ్ పెళ్లి జరిగిన సమయంలో డ్యాన్స్ వేయగా ఆ వ్యక్తితోనే ఇప్పుడు పెళ్లి జరగడం హాట్ టాపిక్ అవుతోంది.
హన్సిక పెళ్లికి మరో నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది.ఈ పెళ్లి వల్ల హన్సిక స్థాయి తగ్గుతుందే తప్ప పెరగదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ప్రాజెక్ట్ ల ఎంపికలో హన్సిక ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హన్సిక రెమ్యునరేషన్ సైతం గతంతో పోలిస్తే భారీగా తగ్గింది.కోటి రూపాయల రేంజ్ లోనే హన్సిక పారితోషికం తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.హన్సిక పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కెరీర్ ను కొనసాగించాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
హన్సిక కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.వైరల్ అవుతున్న కామెంట్ల గురించి హన్సిక స్పందించే ఛాన్స్ అయితే ఉంది.