చిట్లిన జుట్టును రిపేర్ చేసే మ్యాజికల్ రెమెడీ ఇది.. అస్స‌లు మిస్ అవ్వ‌కండి!

సాధారణంగా కొందరి జుట్టు తరచూ చిట్లిపోతుంటుంది.వాతావరణంలో వచ్చే మార్పులు, పోషకాల కొరత, వేడి వేడి నీటితో తలస్నానం చేయడం తదితర కారణాల వల్ల జుట్టు చిట్లి పోతుంటుంది.

 Natural Remedy For Repair Split Ends In Hair! Home Remedy, Split Ends, Hair Care-TeluguStop.com

దీంతో చాలా మంది చిట్లిన జుట్టును కత్తిరించుకుని పోతారు.ఇక జుట్టు కత్తిరించిన కొద్ది రోజులకు మళ్లీ చిట్లిపోతూ ఉంటుంది‌.

అయితే ఇలా జుట్టు చిట్లినప్పుడల్లా కత్తిరించడం ఒక్కటే మార్గం కాదు.ఇంట్లోనే కొన్ని కొన్ని రెమెడీస్ ను పాటిస్తే చిట్లిన జుట్టును సులభంగా రిపేర్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ అందుకు అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక అంగుళం అల్లం ముక్కను( ginger ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి సన్నగా తరుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.

Telugu Care, Care Tips, Remedy, Long, Split Ends, Thick-Telugu Health

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ), రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక ఫుల్ ఎగ్ ను బ్రేక్ చేసి వేసి మరోసారి అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేయాలి.ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Care, Care Tips, Remedy, Long, Split Ends, Thick-Telugu Health

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ న్యాచురల్ రెమెడీని కనుక పాటిస్తే చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.అదే సమయంలో మళ్ళీ మళ్ళీ జుట్టు చిట్లకుండా సైతం ఉంటుంది.

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.కాబట్టి ఈ రెమెడీ ని అస్సలు మిస్ అవ్వకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube