Premi Viswanath:కార్తీకదీపం వంటలక్క ఇంత అందగత్తా.. ఆ డ్రెస్సులో మామూలుగా లేదుగా?

కొన్ని నెలల కిందట కార్తీకదీపం సీరియల్( Karthikadeep serial ) ముగింపు పలికినప్పటికీ కూడా ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ ఆ సీరియల్, ఆ సీరియల్ లో నటించిన నటీనటులను మర్చిపోలేకపోతున్నారు.ముఖ్యంగా వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్( Premi Viswanath ), మోనిత పాత్రలో నటించిన శోభ శెట్టి( Shobha Shetty ), కార్తీక్ పాత్రలో నటించిన నిరూపమ్ పరిటాలను( Nirupam Paritala ) అసలు మర్చిపోలేక పోతున్నారు.

 Kartikadeepam Vantalakka Is So Beautiful Isnt She Normal In That Dress-TeluguStop.com

ఇక వీళ్ళు కూడా సీరియల్ కు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం తమ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు.ఇక ఇతర ప్రాజెక్టులలో బాగా బిజీగా ఉంటున్నారు.

ఇక ఈ ముగ్గురిలో ప్రేమి విశ్వనాథ్ కు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.ఈమె కేరళకు చెందిన మలయాళ నటి.అక్కడ ఎన్నో సినిమాలలో, సీరియల్స్లలో చేసి మంచి పేరు సంపాదించుకుంది.ఇక ఈమెకు రెండు నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి.

ఒక వైపు నటిగానే కాకుండా మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కూడా బాగా బిజీ బిజీగా ఉంటుంది.

Telugu Actresspremi, Premiviswanath, Shared, Shobha Shetty, Western-Movie

ఇక కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సీరియల్ తో ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకుంది.ఇక ఈ సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

ఈ సీరియల్ ముగియడంతో ఆమె ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు.కానీ రీసెంట్ గా నాగచైతన్య నటించిన కస్టడీ మూవీలో కనిపించి అందరికీ సర్ప్రైజ్ చేసింది.

ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.తెగ ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.ఎప్పటికప్పుడు తనను షూట్ చేసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.తెలుగు ప్రేక్షకులు కూడా ఈమెను బాగా ఫాలో అవుతూ ఉంటారు.

ఏదైనా ఫోటో షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఆమె ఫోటోలను ఏకంగా స్టోరీస్ లలో పెట్టి బాగా సందడి చేస్తూ ఉంటారు ఫ్యాన్స్.

ఇక కార్తీకదీపం సీరియల్ లో డైరెక్టర్ ఈమెను నలుపు రంగుతో పాటు కాస్త పాత చీరలతో చూపించిన సంగతి తెలిసిందే.ఈమె పేరు వింటే చాలు ప్రేక్షకులకు ఆమె నటించిన కార్తీకదీపం లుక్ గుర్తుకొస్తుంది.

కానీ ఈమె బయట గ్లామర్ లుక్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది.మంచి మంచి వెస్ట్రన్ డ్రెస్ లలో కూడా కనిపిస్తుంది.

ఇక రంగు కూడా కాస్త తెలుపే అని చెప్పాలి.

Telugu Actresspremi, Premiviswanath, Shared, Shobha Shetty, Western-Movie

అప్పుడప్పుడు తను వెస్ట్రన్ డ్రెస్( Premi Viswanath in Western dress ) లో ఉన్న ఫొటోస్ కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తనకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాల్ లో పంచుకుంది.అందులో తను పార్టీ మూడ్ లో ఉన్నట్లు కనిపించింది.

బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని.మంచి హెయిర్ స్టైల్ తో పాటు గ్లోయింగ్ స్కిన్ తో అందంగా కనిపించింది.

అంతేకాకుండా కాస్త సన్నబడినట్లు కూడా కనిపించింది.దీంతో ఆమె ఫోటోలు బాగా వైరల్ అవ్వటంతో ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ వంటలక్క ఇంత అందగత్తా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube