సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి.చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగిన నటీమణి సాయి పల్లవి.
అందం, అదరిపోయే శరీర ఆక్రుతి లేకపోయినా.చక్కటి నటనతో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తోంది ఈ కేరళ బ్యూటీ.
మలయాళ సినిమా ప్రేమమ్ తో దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత కొద్ది రోజులకే అంటే 2017లో ఫిదా సినిమాతో తెలుగు జనాలను ఫిదా చేసింది.
అయితే ఈ సినిమా కంటే ముందే తను ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది.కానీ అప్పటికీ ఆమె తెలుగు జనాలకు అంతగా తెలియదు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వచ్చాయి.
ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ తో జోడీ కట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయ్ చేసింది.
నాని సినిమాలో తన అసలు పేరుతోనే నటించింది.ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.ఆ తర్వాత విజయ్ దర్శకత్వంలో వచ్చిన దియా సినిమాలో తులసి అనే పాత్రను చేసి అదుర్స్ అనిపించింది.పెళ్లికి ముందే గర్భవతి అయిన పాత్రలో చక్కగా నటించింది.
దియా మాత్రం పెద్ద సక్సెస్ కాలేదు.ఈ సినిమా తర్వాత శర్వానంద్ తో కలిసి పడిపడి లేచే వయసు అనే సినిమా చేసింది.
ఇదికూడా వర్కౌట్ కాలేదు.

మూడేళ్ల విరామం తర్వాత లవ్ స్టోరీతో ముందుకు వచ్చింది సాయి పల్లవి.ఈ సినిమాలో మౌనిక అనే క్యారెక్టర్ చేసింది.పెద్దింటి కుటుంబానికి చెంది.
చిన్ననాటి నుంచే లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది.ఈ సినిమాలో తన నటన జనాలను బాగా మెప్పించింది.
అంతేకాదు ఈ సినిమాలో తన డ్యాన్స్ తో జనాలను బాగా ఆకట్టుకుంది.అయితే ఇప్పటి వరకు తను నటించిన సినిమాలన్నింటిలో ఫిదా సినిమాలో భానుమతి పాత్ర, లవ్ స్టోరీలో మౌనిక క్యారెక్టర్ అద్భుతం అని చెప్పుకోవచ్చు.