వెబ్ సిరీస్ .ఈ పేరు చాల రోజులుగా ఒక ట్రెండ్ ని సృష్టిస్తుంది.
మొన్న ఆ మధ్య రానా( Rana ) మరియు వెంకటేష్( Venkatesh ) నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ చూసాక వామ్మో అని అందరు నోరెళ్ళ బెట్టారు.అయితే తెలుగు లో ఇలాంటివి తీసే దైర్యం ఎవరు చేయరు.
కాస్త మితిమీరిన శృంగారం ఉంటేనే ఆ వెబ్ సిరీస్ తీసిన వారిని, నటించిన వారిని ఒక భూతు డైరెక్టర్ గా లేదా బూతు హీరో మరియు హీరోయిన్ గా చూస్తారు అని మన వాళ్ళ భయం.అందుకే హిందీ లో వస్తున్నాని మసాలా వెబ్ సిరీస్ లు మన దగ్గర రావడం లేదు.అయితే మసాలా వెబ్ సిరీస్ ల తో పాటు మంచివి కూడా రావడం లేదు అని చాల మంది అంటున్న మాట.
ఒక భాషలో తీసి అవసరం ఉన్నన్ని భాషల్లో చూడగలిగే అవకాశం ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు కొత్తగా, మంచిగా చేయడానికి అవసరం ఏముంది అని బద్దకిస్తున్నారో లేదా అంత క్రియేటీవ్ డైరెక్టర్ లేరో కానీ మొత్తానికి తెలుగు లో ఇంకాస్త అడుగు ముందుకు వేస్తే సౌత్ లోనే ఒక మంచి వెబ్ సిరీస్( Web series ) తీసే సత్త ఎవరికీ లేదు అని ప్రూవ్ అవుతుంది.ఇప్పుడు హిందీ లో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) మరియు షాహిద్ కపూర్( Shahid Kapoor ) చేసిన ఫర్జి అత్యంత ఎక్కువ వ్యూస్ వచ్చిన సిరీస్ గా నిలిచింది.దాదాపు నాలుగు కోట్ల వ్యూస్ తో మోస్ట్ వాచూడ్ షో గా రక్తి కట్టిస్తుంది.
ఇదొక్కటే కాదు హిందీ లో చాల సిరీస్ లు ఇలా మంచి ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.
ఉదాహరణకు మీర్జాపూర్( Mirzapur ), క్రిమినల్ జస్టిస్( Criminal Justice ) అన్ని సీసన్స్ , ఫామిలీ మ్యాన్ సీసన్స్, ద నైట్ మేనేజర్, పంచాయత్, ది గ్రేట్ ఇండియన్ మర్డర్ వంటివి టాప్ 10 లో ఉన్నాయ్.ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి థియేటర్ కి వెళ్లే బదులు ఇలాంటి డబ్బింగ్ సిరీస్ లు చూడటం నయ్యం అని అంత అనుకుంటున్నారు.ఒక రకంగా సినిమాలు మూత పడటానికి ఈ సిరీస్ లు కూడా ఒక కారణం.
మరి మన దర్శకులు పిచ్చి సినిమాలు తీయడం మానేసి ఇలాంటి ప్రయోగాత్మక సిరీస్ లు ఎందుకు చేయడం లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.సౌత్ లో ఇంకా ఒకటి కూడా పైన టాప్ టెన్ రేంజ్ లో క్లిక్ అవ్వడం లేదు.