చిట్లిన జుట్టును రిపేర్ చేసే మ్యాజికల్ రెమెడీ ఇది.. అస్స‌లు మిస్ అవ్వ‌కండి!

సాధారణంగా కొందరి జుట్టు తరచూ చిట్లిపోతుంటుంది.వాతావరణంలో వచ్చే మార్పులు, పోషకాల కొరత, వేడి వేడి నీటితో తలస్నానం చేయడం తదితర కారణాల వల్ల జుట్టు చిట్లి పోతుంటుంది.

దీంతో చాలా మంది చిట్లిన జుట్టును కత్తిరించుకుని పోతారు.ఇక జుట్టు కత్తిరించిన కొద్ది రోజులకు మళ్లీ చిట్లిపోతూ ఉంటుంది‌.

అయితే ఇలా జుట్టు చిట్లినప్పుడల్లా కత్తిరించడం ఒక్కటే మార్గం కాదు.ఇంట్లోనే కొన్ని కొన్ని రెమెడీస్ ను పాటిస్తే చిట్లిన జుట్టును సులభంగా రిపేర్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ అందుకు అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక అంగుళం అల్లం ముక్కను( Ginger ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి సన్నగా తరుముకోవాలి.

ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి. """/" / ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil ), రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక ఫుల్ ఎగ్ ను బ్రేక్ చేసి వేసి మరోసారి అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేయాలి.

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ న్యాచురల్ రెమెడీని కనుక పాటిస్తే చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.

అదే సమయంలో మళ్ళీ మళ్ళీ జుట్టు చిట్లకుండా సైతం ఉంటుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.

జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.

కాబట్టి ఈ రెమెడీ ని అస్సలు మిస్ అవ్వకండి.