కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం: ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ పైఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మన గ్రామం సహజ ఉత్పత్తుల కేంద్రం సందర్శన సమయంలో వెంకయ్య కాళ్లకు నమస్కరించిన మహిళలు.
మహిళలు నమస్కరించడం పై పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న వెంకయ్యనాయుడు.ఎన్టీఆర్ ఇంట్లో కూర్చున్న సమయంలో మహిళలు ఆయనకు నమస్కరించారు.
ఎందుకు నమస్కరించారని నేను ఎన్టీఆర్ ను అడిగా.నా పై వారికున్న ప్రేమ, అభిమానం అని ఎన్టీఆర్ బదులిచ్చారు.అభిమానమా…పిండాకూడా అంతా ఒట్టిదేనని నేను చెప్పా.కట్ చేస్తే ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ లో ఆ ఆరుగురే ముందున్నారు.