స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ముక్కుసూటిగా మాట్లాడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.పైకి ఒక మాట చెప్పడం మనస్సులో ఒక మాట ఉండటం బాలయ్యకు నచ్చదనే సంగతి తెలిసిందే.
అన్ స్టాపబుల్ షోలో బాలయ్య నాకు గన్ను పట్టుకుని గూఢచారి వేషాలు వేయాల్సి ఉంటుందని గూఢఛారి 25 లేదా గూఢచారి 26లో నేను నటిస్తానని చెప్పుకొచ్చారు.శర్వానంద్ తెలివితేటలు బీ సెంటర్ తెలివితేటలు అని బాలయ్య కామెంట్ చేశారు.
అడివి శేష్ మాట్లాడుతూ బాలయ్య వల్ల నా తలపై దెబ్బలు పడ్డాయని తెలిపారు.బీడీలు తాగండి బాబులూ పాట పాడటం వల్ల అమ్మ తలపై కొట్టిందని పేర్కొన్నారు.
శర్వానంద్ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి ఒక డౌట్ అని మీరు 100కు పైగా సినిమాలు చేశారని పాతిక 30 మందీ హీరోయిన్లతో చేసుకుంటారు కదా అని అడగగా చేసుంటారు అంటే ఏంటని అడివి శేష్ అన్నారు.బాలయ్య వెంటనే ప్రతిదీ బూతేంటయ్యా బాబు అంటూ కామెంట్ చేశారు.
చేసుంటాను కాదు చేశానని బాలయ్య చెప్పుకొచ్చారు.

రూమర్లు రాకుండా ఎలా మేనేజ్ చేశారని అడగగా బాలయ్య మీద రాసే దమ్ముందా బాలయ్యను కాదనే దమ్ముందా అని బాలకృష్ణ అన్నారు.టిప్స్ ఏం లేవని జన జీవన స్రవంతిలో కలుపుకుంటానని బాలయ్య పేర్కొన్నారు.మీతో టీం స్పెండ్ చేయడం మా అదృష్టం శర్వానంద్ బాలయ్యతో వెల్లడించారు.
మేమిద్దరం సెల్ఫ్ మేడ్ స్టార్స్ అని శర్వానంద్ కామెంట్లు చేశారు.

గేట్ కీపర్ కూడా బాలయ్య ఫ్యానే? అని బాలయ్య చెప్పగా ఎవరు కాదు అని శర్వానంద్ వెల్లడించారు.రన్ రాజా రన్ మూవీలో నా సీన్లను శర్వానంద్ కట్ చేశారని అడివి శేష్ తెలిపారు.ఆ తర్వాత నాకు కూడా శర్వానంద్ ఇన్ స్పిరేషన్ అని కామెంట్లు చేశారు.
నాకు నేను కథలు రాసుకున్నానని ఆ కథలతో సినిమాలు చేస్తున్నానని అడివి శేష్ వెల్లడించారు.