తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి.మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటనలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో మళ్లీ ఇప్పుడు తెలంగాణలో టీడీపి పుంజుకునేలా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో ఇప్పటి వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కాని నరసింహులకు పోలిట్ బ్యూరోలో స్థానంతో పాటు … టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఈ నెల 10వ తారీకు జ్ఞానేశ్వర్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఇదే సమయంలో తెలంగాణ టీడీపీ పార్టీ నాయకులతో చంద్రబాబు భేటీ కానున్నరట.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో టీడీపీ బలహీన పడింది.
అయితే వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… టీటీడీపీ మళ్లీ బలోపేతం అయ్యే దిశగా చంద్రబాబు టీటీడీపీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.







