కాంచన 4 గురించి స్పందించిన లారెన్స్... మరోసారి అందరిని భయపెట్టబోతున్నారా?

రాఘవ లారెన్స్( Raghava Lawrence ) తాజాగా చంద్రముఖి 2 ( Chandramukhi 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.

 Raghava Lawrence Comments About Kanchan 4, Raghava Lawrence, Kanchana 4 ,jigar-TeluguStop.com

ఇక ఈ సినిమా పెద్దగా కలెక్షన్లను సాధించలేకపోవడంతో లారెన్స్ తన తదుపరి సినిమా పనులలో బిజీ అయ్యారు.ఇక ఈయన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా లారెన్స్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telugu Chandra Mukhi, Kanchana, Kollywood, Tollywood-Movie

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన చంద్రముఖి 2 గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కాంచన 4 ఎప్పుడు వస్తుంది అంటూ విలేకరులు ఈయనని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇప్పటికే కాంచన ( Kanchana )సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులందరిని భయపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా నాలుగవ భాగం కూడా రాబోతుందనే ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో ఈయన ఆసక్తికరమైనటువంటి సమాధానం తెలిపారు.

Telugu Chandra Mukhi, Kanchana, Kollywood, Tollywood-Movie

ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ తాను అన్ని దయ్యం సినిమాలు తీసుకుంటూ పోతూ ఉండటం వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని తెలిపారు.నాకు రాత్రిపూట కలలో కూడా అవే కనిపిస్తున్నాయని, చాలా భయంగా ఉంటుందని ఈయన వెల్లడించారు అందుకే ఇప్పుడప్పుడే తాను కాంచన 4 ( Kanchana 4 )గురించి ఎలాంటి ఆలోచనలు చేయలేదని లారెన్స్ తెలిపారు.ఇక ఈ సినిమా తప్పకుండా వస్తుంది కానీ కాస్త ఆలస్యం అవుతుంది అంటూ కాంచన 4 గురించి లారెన్స్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే భవిష్యత్తులో తప్పకుండా కాంచన 4 వస్తుందని మరోసారి ఈయన ప్రేక్షకులను భయపెట్టడం ఖాయం అంటూ కొందరు ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube