టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో( Devara movie ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి.
దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.ఈ సినిమాలో జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది.

ఎన్నో అంచనాలు పెట్టుకున్న అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichandran ) దేవర టైటిల్ ట్రాక్ తో డిజపాయింట్ చేశాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చిన కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డల్ అయ్యారు.అయితే ఈ సినిమా మ్యూజిక్ భారీగా ఉంటుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ తో ఆ అంచనాలు తారు మారయ్యాయి.
మరోపక్క ఇండియన్ 2( Indian 2 ) నుంచి వస్తున్న సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్స్ చేయలేకపోవడంతో అనిరుద్ పై అనుమానాలు మొదలయ్యాయి.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంతగా టెన్షన్ పడడానికి కారణం అల్లు అర్జున్ పుష్ప సాంగ్స్ ఒక్కొక్కటిగా మ్యూజిక్ లవర్స్ ని ఊపెయ్యడమే కాదు, యూట్యూబ్ లో రికార్డ్ లైక్స్ కొడుతూ హల్చల్ చెయ్యడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కలత మొదలైంది.దేవర సాంగ్ పుష్ప సాంగ్ దరిదాపుల్లో లేదు అనే కామెంట్స్ వారిని ఇబ్బంది పెడుతున్నాయి.కోలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా మార్కెట్ లో అనిరుద్ మ్యూజిక్ కి అభిమానులు ఎక్కువయ్యారు.
కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి ఆకట్టుకోలేని మ్యూజిక్ ఇచ్చి దేవరని ఏం చేస్తాడో అనే భయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనబడుతున్నారు.