ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.గతంలో ఎన్నడూ లేని విధంగా 80%కి పైగా పోలింగ్ నమోదు కావడం సంచలనంగా మారింది.
దీంతో విజయంపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో రఘురామ కృష్ణరాజు( Rama Krishna Rajun ) ఏపీ ఎన్నికల ఫలితాలు గురించి మాట్లాడుతూ వైసీపీ పై సెటైర్లు వేశారు.
ఏపీ ఎన్నికల ఫలితాలు గురించి ఒకపక్క కేఏ పాల్.మరోపక్క వైఎస్ జగన్ 175 సీట్లు వస్తాయంటున్నారని.
వారికి పెద్ద తేడా లేదని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
ఎన్డీఏ కూటమికి తక్కువలో తక్కువ 125 స్థానాలు వస్తాయనుకుంటున్నాం.
ఎన్నికల్లో రిగ్గింగ్( Election rigging ) ను అరికట్టేందుకు వెళ్తే ఇన్ని కేసులా అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాలో మాట్లాడటం చూస్తే కంచ చేను మేస్తే అన్నట్లు ఉంది.జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తామని పేర్కొన్నారు.2019 ఎన్నికలలో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు పోటీ చేసి గెలిచారు.ఈసారి ఎన్నికలలో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో జాయిన్ అయ్యి.
ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది.వాస్తవానికి ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయాలని రఘురామకృష్ణరాజు భావించారు.
మొదట్లో బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నట్లు ఆయనే స్వయంగా ఒక కార్యక్రమంలో తెలిపారు.కానీ ఆఖరి నిమిషంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు.
ఉండి ఎమ్మెల్యేగా పోటీకి దిగటం జరిగింది.