సాధారణంగా ఎస్వీ రంగారావు గారి( SV Rangarao )ని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు ఆయన సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు.ప్రతి చిత్రంలో వైద్యమైన నటనతో ఆయన ఎన్నో ఏళ్లపాటు సినిమా ఇండస్ట్రీలో ఏకచిత్రాధిపత్యం చేశారు.
ఆయన నటనకు ముద్దులు కానీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అంతలా సన్నివేశంలో దూదిపోయి పరకాయ ప్రవేశం చేసిన మాదిరిగా అతని నటన ఉంటుంది.
ఇప్పటికీ ఎంతోమంది నటీనటులకు ఆదర్శం ఎస్వీ రంగారావు మాత్రమే.అలాంటి ఎస్వీ రంగారావుకి ఎవరు ఆదర్శం లేదా అభిమానం నటుడు అంటే ఎవరికి ఆయన ఖచ్చితమైన అభిప్రాయం తెలీదు.
కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఎస్వీ రంగారావు కి రావు గోపాలరావు నటన( Rao Gopal Rao ) అంటే ఎంతో ఇష్టమట.
ఇక్కడే మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు ఎందుకంటే ఎస్వి రంగారావు 1974లోనే కన్నుమూశారు.ఇక ముత్యాల ముగ్గు వంటి సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ నటుడిగా 1975లోనే రావు గోపాల్ రావు చాలా ఫేమస్ అయిపోయారు.అలా రావు గోపాల్ రావు నటన ఎక్కడ ఎస్.వి.రంగారావు చూశారు ఎప్పుడు అభిమాని అయ్యారు అనే సందేహం మీకు కలగచ్చు.వీరిద్దరి మధ్య పరిచయం నాటక రంగంతోనే సాధ్యమైంది.నాటక రంగంలో అద్భుతంగా లభించే వారు ఎప్పటికైనా గొప్ప నటలవుతారని ఎస్సీ రంగారావు నమ్మేవారు.రావు గోపాలరావు నాటకాలు వేస్తున్న సమయంలో ఓసారి ఎస్వీ రంగారావు గమనించారు.అక్కడే ఆయనను పిలిచి నీ నటన నేను అభిమానిని అయిపోయాను నువ్వు ఎప్పటికైనా గొప్ప నటుడివి అవుతావు అని చెప్పారట.
అలా కాకినాడ( Kakinada )లో మొదలైన వీరి పరిచయం ఎస్వీ రంగారావు గారికి రావు గోపాల్ రావు పై నమ్మకం పెరిగేలా చేసి ఆయనను చెన్నై పిలిపించుకుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసేంత వరకు వచ్చింది.మొదట ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం ఎస్సీ రంగారావు కల్పించగా అక్కడి నుంచి ఆయన నటన కూడా మొదలుపెట్టి నాలుగు వందల సినిమాల్లో పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు.ఎంతోమంది రావు గోపాలరావు వాయిస్ బాగాలేదు అని చెప్పేవారట.తన డబ్బింగ్లో పట్టు పట్టి మెరుగులు దిద్దుకొని ఆ తర్వాత సొంత డబ్బింగ్ తోనే ఎన్నో చరిత్రలో గుర్తుండిపోయే డైలాగ్స్ చెప్పారు రావు గోపాల్ రావు.