కేవలం ఇంటర్వెల్ కోసం 5 నెలలు సమయం తీసుకున్న చిరు సినిమా ఏంటో తెలుసా?

సాధారణంగా మామూలు రొమాంటిక్ కామెడీస్ ఉన్నారు అంతా కోసమేందో పూర్తవుతాయి.అదే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలు, ఫాంటసీ, సై-ఫై, సూపర్ నేచురల్ ఫిలిమ్స్ పూర్తి చేయడానికి రెండు మూడు ఏళ్లు పట్టొచ్చు.

 Chiranjeevi Movie Took Interval 5 Months ,anji Movie, Chiranjeevi , Tollywood ,-TeluguStop.com

ఎందుకంటే గ్రాఫిక్స్, తదితర సన్నివేశాలు ఎక్కువ సమయాన్ని డిమాండ్ చేస్తాయి.అయితే రాజమౌళి లాంటి పర్ఫక్షనిస్టులకు కూడా మూడేళ్ల కంటే ఎక్కువ సమయం తీసుకోరు.

కానీ ఒక చిరంజీవి సినిమాను పూర్తి చేయడానికి ఐదేళ్ల సమయం పట్టింది.ఆ మూవీ మరేదో కాదు ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ ఫిల్మ్ “అంజి( Anji ).

Telugu Anji, Chiranjeevi, Interval Scene, Mani Sharma, Tollywood-Movie

రూ.25 నుంచి రూ.30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రిలీజ్ సమయం నాటికి హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీ గా రికార్డు క్రియేట్ చేసింది.2004లో రిలీజ్ అయినను ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకుడిగా వ్యవహరించాడు.మణిశర్మ( Mani Sharma ) సంగీత బాణీలు సమకూర్చాడు.నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించింది.ఈ మూవీ ఏం ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు పూర్తిగా గ్రాఫిక్స్ వాడేసారు అందువల్ల దీని నిర్మాణం ఖర్చు బాగా పెరిగిపోయింది.అయితే డబ్బు విషయంలో ఇబ్బంది పడకపోయినా సినిమా షూటింగ్స్ కంటిన్యూగా పూర్తి చేయలేదట మేకర్స్ బాగా సఫర్ అయ్యారు.

మేకర్స్ ఈ మూవీని పూర్తి చేయడానికి ఐదేళ్లు తీసుకున్నారు.నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి దీనివల్ల చాలా ఇక్కట్లను ఎదుర్కొన్నారు.

Telugu Anji, Chiranjeevi, Interval Scene, Mani Sharma, Tollywood-Movie

శ్యాం ప్రసాద్ రెడ్డి( Shyam Prasad Reddy )కి చిరంజీవి డేట్స్ ఇచ్చినప్పుడు ఆయన ఫుల్ లెన్త్ గ్రాఫిక్స్ సినిమా తీయాలనుకున్నారు అయితే దర్శకుడు కోడి రామకృష్ణ మాత్రం అది రిస్క్ తో కూడుకున్న పని అని కమర్షియల్ సినిమాకి తగిన కథ తన దగ్గర ఉందని చెప్పారట.కానీ శ్యాం ప్రసాద్ రెడ్డి మాత్రం గ్రాఫిక్స్ సినిమానే కావాలని పట్టు బట్టారు చిరు కూడా ఎంత రిస్కైనా సరే తీద్దాం అంటూ ఎంకరేజ్ చేయడంతో కోడి రామకృష్ణ ఈ మూవీని మొదలుపెట్టారు.ఒక సీన్ తీయడానికి 120 టేక్స్ తీయాల్సి వచ్చేదట.చిరంజీవి ఒక కాస్ట్యూమ్ రెండు సంవత్సరాలు వేసుకున్నారు.ఎందుకంటే గ్రాఫిక్స్ మార్కర్లు ఆ కాస్ట్యూమ్ పై కరెక్ట్ గా సెట్ చేశారు.మళ్లీ వేరే కాస్ట్యూమ్ వేసుకుంటే కొత్త మార్కర్స్ పెట్టాల్సి వస్తుంది.

అది సమయంతో పాటు శ్రమతో కూడుకున్న పని.ఇక ఒక ఇంటర్వెల్ సీన్ తీయడానికి నెల రోజుల సమయం పట్టింది.మొత్తం మీద ఐదు ఏళ్లు కష్టపడి సినిమా తీస్తే అప్పట్లో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.కానీ ఈ సినిమా ఇప్పుడు టీవీలో వస్తే ప్రేక్షకులు తప్పకుండా మిస్ కాకుండా చూస్తారు.

చూడగా చూడగా ఈ సినిమా అందరికీ బాగా నచ్చేసింది కానీ అప్పట్లో నిర్మాతకు మాత్రమే నష్టాలను మిగిల్చింది.చిరంజీవి కూడా ఈ మూవీ కోసం టీమంతా చాలా కష్టపడిందని, తన కెరీర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube