అందాన్ని పెంచుకునేందుకు ఫేస్ ప్యాక్ లు వేసుకుంటున్నారా.. అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

అందరిలో తామే అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ఈ నేపథ్యంలోనే కొందరు స్కిన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు.

ఖరీదైన టోనర్, మాయిశ్చరైజర్, సీరం, క్రీమ్, సన్ స్క్రీన్.ఇలా చర్మం కోసం ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతుంటారు.

అలాగే అందాన్ని పెంచుకునేందుకు ఇంట్లోనే రకరకాల ఫేస్ ప్యాకులు వేసుకుంటారు.నిజంగా ఇది చాలా మంచి పద్ధతి.

సహజ అందాన్ని పొందడానికి ఇవి ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.అయితే ఫేస్ ప్యాక్ లు వేసుకునే సమయంలో కొన్ని కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు.

Advertisement

మరి ఆ పొరపాట్లు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో ఎప్పుడూ ఒకే రకమైన ఫేస్ ప్యాక్ ను వేసుకునేందుకు ఎవరూ ఇష్టపడరు.

కొత్త కొత్తగా ట్రై చేస్తుంటారు.అయితే కొత్తరకం ఫేస్ ప్యాక్ ట్రై చేస్తున్నప్పుడు నేరుగా ముఖానికి అప్లై చేసుకోకూడదు.

చర్మ తత్వాలు బట్టీ అన్ని రకాల ఫేస్ ప్యాక్ లు అందరికీ పడవు.దురద, ఎలర్జీ, మంట( Itching, allergy, inflammation ) వంటివి తలెత్తుతాయి.

అందుకే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.చేతిపై కొద్దిగా అప్లై చేసి ఎలాంటి అసౌకర్యం లేకపోతే అప్పుడు ఫేస్ కు అప్లై చేసుకోవాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అలాగే ఫేస్ ప్యాక్ ( Face pack )లు వేసుకున్నప్పుడు ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత అందం పెరుగుతుందని అనుకునేవారు చాలామంది ఉన్నారు.కానీ అది అపోహ మాత్రమే.నిజానికి ఫేస్ ప్యాక్ లను 20 నిమిషాలకు మించి ఉంచుకోకూడదు.

Advertisement

ఇంకా చెప్పాలంటే 15 నిమిషాల్లోనే కడిగేసుకోవాలి.ఎక్కువ సమయం పాటు ఫేస్ ప్యాక్స్‌ను ఉంచుకుంటే స్కిన్ డ్రై అయిపోతుంది.

ఇక ఫేస్ ప్యాక్ లు వేసుకునే ముందు కచ్చితంగా ముఖాన్ని వాష్ చేసుకోవాలి.మరియు మేకప్ ఏమైనా ఉన్నా కూడా కచ్చితంగా రిమూవ్ చేయాలి.అలా కాకుండా నేరుగా ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.

ప్యాక్ లోని సుగుణాలు ఏమి మీ చర్మం లోకి ఇంకవు.కాబట్టి ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు వాటర్ తో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

తాజా వార్తలు