బాల్యంలో ఆ హీరోలాంటి డ్రెస్ వేసుకోవాలని ప్రభాస్ మారం చేశారా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ( Hero Prabhas )గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 Prabhas Demanded Kamal Haasans Dress In Sagara Sangamam, Sagara Sangamam, Prabha-TeluguStop.com

ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్.డార్లింగ్ చివరిగా నటించిన సినిమా సలార్( Salar ).భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించింది.ఇకపోతే ప్రభాస్ త్వరలోనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ప్రభాస్ నటించిన కల్కి మూవీ ( Kalki Movie )త్వరలోనే విడుదల కానుంది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే చిత్ర బృందం ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.అందులో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్స్ లో డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.చిన్నప్పుడు ప్రభాస్ కమల్ హాసన్ నటించిన సాగర సంగమం సినిమా( Sagara Sangam movie ) చూసి అలాంటి డ్రెస్ కావాలని ఇంట్లో మారాం చేశాడట.

ఆ డ్రెస్ వేసుకుంటే, అలా డాన్స్ చేయవచ్చని భావించేవాడట.కానీ కమల్ హాసన్ లా తల కూడా తిప్పలేకపోయానని చెప్పుకొచ్చాడు.కల్కి మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ ఫన్నీ విషయాన్ని షేర్ చేశాడు ప్రభాస్.ఇకపోతే కల్కి సినిమా విషయానికి వస్తే తాజాగా బుజ్జి ని పరిచయం చేశారు.

స్వయంగా ప్రభాస్ ఎంతో హైప్ ఇచ్చిన ఈ బుజ్జి ఒక కారు అన్న విషయం తెలిసిందే.ఆ కారును ఈరోజు ఆవిష్కరించారు.స్వయంగా ప్రభాస్ బుజ్జిపై కూర్చొని విన్యాసాలు చేశాడు.రయ్ మంటూ కారులో దూసుకొచ్చి ప్రేక్షకులముందు వాలాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube