సజ్జల ప్రశ్నలకు జవాబులున్నాయా... ఈసీ ఆధీనంలో ఉండాల్సిన వీడియోలు ఎలా వచ్చాయంటూ?

ప్రస్తుతం ఏపీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) ఈవీఎం ధ్వంసం చేయడం గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.అయితే ఓటమే ఎరుగని పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం లేదు.

 Sajjala Ramakrishnareddy Shocking Quesions To Election Commission Details Here G-TeluguStop.com

మరోవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించగా ఆ ప్రశ్నలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఈసీ ఆధీనంలో ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ వీడియోలు అసలు బయటకు ఎలా వచ్చాయంటూ సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala ramakrishnareddy )ప్రశ్నించారు.

మాచర్ల విషయంలో ఈసీ తీరు గురించి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు.పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణల విషయంలో ఎన్నికల కమిషన్ చట్టబద్ధంగా వ్యవహరించాలని వైసీపీ లేవనెత్తే కొన్ని ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పాలని ఆయన కోరారు.

పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా వీడియో తీస్తే ఆ వీడియో ఈసీ ప్రత్యేక ఆస్తి అవుతుంది తప్ప ఆ వీడియో ఎలా లీక్ అవుతుందని సజ్జల కామెంట్లు చేశారు.వీడియో ఒరిజినలో కాదో తెలియకుండా ఈసీ అంత వేగంగా స్పందించాల్సిన అవసరం ఏముందని సజ్జల పేర్కొన్నారు.ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం మాచర్ల( Macherla )లో 7 ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని ఆ వీడియోలను బయటకు రిలీజ్ చేసి దోషుల విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు.

అమాయకపు ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేసినట్టు ఆధారాలు ఉన్న వీడియోలు ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సజ్జల కామెంట్లు చేశారు.ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని సజ్జల కోరారు.అయితే వైరల్ అయిన వీడియోను తాము విడుదల చేయలేదని ఏపీ ఎన్నికల కమిషన్ అధికారి ముఖేష్ కుమార్ మీనా ( Mukesh Kumar Meena )స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube