బాన పొట్ట లేదా బెల్లీ ఫ్యాట్( Belly fat ).చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఒకటి.
శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న కొందరికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి లావుగా మారుతుంటుంది.బాన పొట్ట కారణంగా శరీర ఆకృతి దెబ్బతింటుంది.
పైగా ఎన్నో అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతాయి.ఈ క్రమంలోనే బాన పొట్టను కరిగించుకునేందుకు తోచిన ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీ డైట్ లో ఉండాల్సిందే.
రోజు ఉదయాన్నే ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎలాంటి బాన పొట్ట అయినా సరే నెల రోజుల్లో మాయం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు లెమన్ స్లైసెస్( Lemon Slices ), రెండు స్ట్రాబెర్రీ స్లైసెస్, ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసుకుని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.

ఇలా మరిగించిన వాటర్ లో మూడు లేదా నాలుగు కీరా దోసకాయ స్లైసెస్ వేసి స్టవ్ ఆఫ్ చేసి నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి.ఆ తర్వాత వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి సేవించాలి.ఈ డ్రింక్ ను రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.ప్రతిరోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.

ఎలాంటి బాన పొట్ట అయినా సరే కొద్ది రోజుల్లోనే కరుగుతుంది.పైగా ఈ స్ట్రాబెర్రీ కుకుంబర్ గ్రీన్ టీ ను తీసుకోవడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది.బాడీ ఫుల్ ఎనర్జిటిక్ గా మారుతుంది.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
చర్మం యవ్వనంగా నిగారింపుగా మెరుస్తుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.
బాడీ హైడ్రేటెడ్ గా సైతం ఉంటుంది.కాబట్టి బాన పొట్టతో బాధపడుతున్న వారు మాత్రమే కాదు ఎవ్వరైనా ఈ డ్రింక్ ను తీసుకోవచ్చు.