వైసీపీ నేత అంబటి రాంబాబు పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..!!

వైసీపీ నేత అంబటి రాంబాబు ( Ambati Rambabu ) సత్తేనపల్లి నియోజకవర్గంలో నాలుగు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు.నిన్న హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా.

 Ycp Leader Ambati Rambabu Petition Dismissed By High Court Ap Elections, Ycp Lea-TeluguStop.com

నేడు హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది.చంద్రగిరి( Chandragiri ) లోను రీపోలింగ్ జరపాలని వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పిటిషన్ ను కూడా కోర్టు డిస్మిస్ చేయడం జరిగింది.

సత్తేనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డులలో రీపోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు నిన్న హైకోర్టును ఆశ్రయించారు.ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదు మందిని చేర్చడం జరిగింది.

ఈ పిటిషన్ ను నేడు ధర్మాసనం డిస్మిస్ చేయడం జరిగింది.

ఏపీలో పోలింగ్ రోజు నుండి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.కొన్ని నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు( Evms ) కూడా పగలగొట్టేశారు.వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఇటీవల బయటపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ టైంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.అయినా గాని ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు.80 శాతం కంటే ఎక్కువగానే పోలింగ్ నమోదయింది.దీంతో గెలుపు విషయంలో వైసీపీ మరియు తెలుగుదేశం కూటమి నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరి జూన్ 4వ తారీఖు రాబోయే ఫలితాలలో ఎవరు గెలవనున్నారో తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube