హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును( CCS ACP Uma Maheswara Rao ) రిమాండ్ కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.ఈ మేరకు ఆయనకు ఏసీబీ కోర్టు( ACB Court ) 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వరరావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.ముందుగా ఉస్మానియా ఆస్పత్రిలో( Osmania Hospital ) వైద్యపరీక్షలు నిర్వహించారు.అనంతరం ఆయనను ఏసీబీ కోర్టుకు తరలించారు.అయితే విచారణకు ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఏసీబీ అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది.