టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కెరిర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి.ప్లాప్ అయిన సినిమాలలో బ్రహ్మోత్సవం సినిమా( Brahmotsavam Movie ) కూడా ఒకటి.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది.శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
కానీ కట్ చేస్తే మొదటి ఆటకే దారుణమైన టాక్ ని తెచ్చుకోవడంతో పాటు అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది.
అయితే ఆ సమయంలో 5జి టెక్నాలజీ ఈ స్థాయిలో లేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ట్రోలింగ్ గురించి ఊహించుకుంటేనే భయం వేస్తుంది.ఇక ఆర్టిస్టుల సంగతి సరేసరి.ఈ ఫ్లాప్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడతారు.
కానీ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) మాత్రం షాక్ ఇచ్చింది.తన కెరీర్ లో ఇష్టమైన సినిమాల్లో బ్రహ్మోత్సవంలో చేసిన పాత్ర మొదటిదని ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో కాజల్ మాటలకు ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
అయితే నిజానికి అందులో సమంతా( Samantha ) మెయిన్ హీరోయిన్.కాజల్ ఫస్ట్ హాఫ్ తర్వాత కనిపించదు.
అయినా సరే ఇంత ప్రత్యేకంగా కాజల్ దాని గురించి చెప్పడం విచిత్రమే అని చెప్పాలి.ఇకపోతే తాజాగా కాజల్ ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం సత్య బామ.( Satyabhama Movie ) ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది కాజల్.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాప్ మూవీ గురించి అలాంటి వాఖ్యలు చేసింది.పెళ్లి చేసుకున్న తరువాత కొంత కాలం పాటు బ్రేక్ తీసుకున్న కాజల్ అగర్వాల్ తిరిగి సత్యభామ తనకు బ్రేక్ ఇస్తుందని ఎదురు చూస్తోంది.
మరి ఈ మూవీ ఆమెకు ఎలాంటి గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి మరి.