ఆ తెలుగు సినిమాలో అంతగా ఏముంది.. రజినీకాంత్ 14 సార్లు ఎందుకు చూశాడు..??

సాధారణంగా ఒక సినిమా చాలా బాగుంటే నాలుగైదు సార్లు చూస్తాం.అంతకంటే ఎక్కువసార్లు చూసినా పెద్దగా ఎంజాయ్ చేయలేము.

 Why Rajinikanth Watched This Movie ,rajinikanth ,sobhan Babu , Kollywood, Man-TeluguStop.com

అన్ని చూసిన సన్నివేశాలే ఉంటాయి కాబట్టి ముందుగా చూసినంత అనుభూతి కలగదు.బోర్ కొట్టేస్తుంది.

ఇక సెలబ్రిటీలు సినిమాలను రెండు – మూడు సార్ల కంటే ఎక్కువ చూడలేరు.సినిమాల్లోకి రాకముందు అయినా అంతే! కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఒక తమిళవాడైనా ఒక తెలుగు సినిమాని 14 సార్లు చూశాడట.

ఈ విషయాన్ని స్వయంగా అతనే ఒక సందర్భంగా తెలియజేశాడు.ఆ సినిమా మరేదో కాదు శోభన్ బాబు హీరోగా నటించిన ‘మానవుడు దానవుడు (1972)( Manavudu Danavudu ) ఈ మూవీ విడుదల 50 ఏళ్లు కావస్తోంది.

Telugu Ajinikanth, Yana Reddy, Kollywood, Sobhan Babu, Tollywood-Movie

ఇది రిలీజ్ అయిన సమయంలో రజినీకాంత్‌( Rajinikanth ) బెంగళూరులో బస్‌ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు.పి.సి.రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇందులో హీరోగా చేసిన శోభన్‌బాబుకు ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయ్యింది.దీని తర్వాత ఆయన కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోలేదు.అతని రెమ్యునరేషన్‌ ఒక్కసారిగా లక్ష రూపాయలకు చేరుకుంది.తెలుగులో రూ.1 లక్ష పారితోషికం పొందిన తొలి హీరో శోభన్‌బాబే కావడం విశేషం.నిజానికి ఈ సినిమాలో ఆయన చూపించిన నటనను చూస్తే ఎవరైనా సరే అప్పట్లో ఆయ రూపాయల రెమ్యునరేన లక్షషన్‌ను ఆఫర్ చేయడం తక్కువే అనుకుంటారు.

అంత బాగా ఇందులో శోభన్ బాబు నటించాడు.

Telugu Ajinikanth, Yana Reddy, Kollywood, Sobhan Babu, Tollywood-Movie

ఈ సినిమాకి ముందుగా శోభన్ బాబు( Sobhan Babu ) రాముడు మంచి బాలుడు టైప్ పాత్రలు చేశాడు.ఇందులో మాత్రం పూర్తి అగ్రెసివ్‌ క్యారెక్టర్‌లో కనిపించి మంటలు పుట్టించాడు.డే టైమ్‌లో ప్రాణాలు పోసే డాక్టర్‌గా, నైట్ టైమ్‌లో ప్రతీకారంతో రగిలిపోతూ ప్రాణాలు తీసే జగన్‌గా శోభన్ బాబు నటించాడు.

రెండు పాత్రలలో అద్భుతమైన వేరియేషన్‌ చూపించే అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు.ఈ సినిమా దిశ, నిర్భయ లాంటి రియల్ లైఫ్ స్టోరీలకు దగ్గరగా ఉంటుంది.ఇందులో శోభన్ బాబు అక్కకు అన్యాయం జరుగుతుంది.అక్కను ఆడ్ చేసినా కామాంధుడిని శోభన్ బాబు చంపేస్తాడు అలాగే కామంతో ఆడవాళ్లను కాటేసే రాక్షసులను అంతం చేస్తుంటాడు.

వ్యభిచార గృహాల్లో మగ్గిపోతున్న ఆడవాళ్ళ గురించి సి.నారాయణరెడ్డి( C Narayana Reddy ) ‘ఎవరు వీరు ఎవరు వీరు.’ అనే పాట సినిమా కోసం రాశారు.ఈ పాట చిత్రీకరణ 20 రోజులపాటు సాగింది.చాలా మంచి కథతో సామాజిక సందేశంతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.అందులో రజనీకాంత్ కూడా ఒకరు.

ఈ మూవీ కథ, శోభన్ బాబు టెరిఫిక్ యాక్టింగ్, పాటలు బాగా నచ్చి దీనిని 14 సార్లు చూశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube