పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) జూన్ 27వ తేదీ కల్కి( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఈ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల కమల్ హాసన్( Kamal Hassan ) ప్రభాస్, అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో విడుదల అయింది.
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఈయన ప్రభాస్ అభిమానులకు ఏకంగా క్షమాపణలు చెబుతూ చేసిన ఈ కామెంట్స్ సంచలనగా మారాయి.ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ ఈ సినిమా కథ చెప్పడం కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) నా దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో నా పాత్ర ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందో తెలియజేయడం కోసం కొన్ని ఫోటోలు నాకు చూపించారు.
ఈ సినిమాలో నా పాత్ర ప్రభాస్ ను కొట్టే పాత్ర అని అమితాబ్ బచ్చన్ తెలిపారు.అయితే సినిమా విడుదలైన తర్వాత నేను ప్రభాస్ ని కొట్టడం చూసి అభిమానులు నన్ను ట్రోల్ చేయకండి.ఇలా ప్రభాస్ ను కొట్టినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ అమితాబ్ కామెంట్లు చేశారు.ఇలా ప్రభాస్ అభిమానులకు ఈయన క్షమాపణలు చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి ప్రభాస్ అయ్యో సర్ వారంతా మీకు కూడా అభిమానులే అంటూ చెప్పుకువచ్చారు.
ఇలా ప్రభాస్ అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇక ప్రభాస్ కి జోడిగా దీపిక పదుకొనె( Deepika Padukone ) నటిస్తున్నారు.