2 నెలలకే 45 వేల కరెంటు బిల్లు.. కొవ్వొత్తులు వాడటం ఉత్తమంటున్న యజమాని..??

సాధారణంగా ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగిస్తే కరెంట్ బిల్లు( Current Bill ) ఎక్కువగా వస్తుంది.అయితే ఈ బిల్లు అనేది పదివేల లోపే ఉంటుంది.

 Switching To Candles Gurugram Man Fumes Over Rs 45000 Electricity Bill Details,-TeluguStop.com

కానీ గురుగ్రామ్‌కు( Gurugram ) చెందిన ఓ వ్యక్తికి మాత్రం గత రెండు నెలల్లో వరుసగా రెండు అధిక విద్యుత్ బిల్లులు వచ్చాయట దాంతో అతను సోషల్ మీడియా వేదికగా అందుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.జాయిన్ హుడ్ యాప్ సహ వ్యవస్థాపకుడైన జస్వీర్ సింగ్( Jasveer Singh ) రూ.45,000 కంటే ఎక్కువ మొత్తం ఉన్న తన విద్యుత్ బిల్లు స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు.ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయి, చాలామందిలో చర్చకు దారి తీసింది.

తన పోస్ట్‌లో సింగ్ బిల్లు చెల్లించిన తర్వాత, అధిక విద్యుత్ ఖర్చు కారణంగా మళ్లీ కొవ్వొత్తులను వాడటం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.అతను పంచుకున్న స్క్రీన్‌షాట్ పేటీఎం ద్వారా చెల్లించిన రూ.45,491 మొత్తాన్ని చూపిస్తుంది.సింగ్ ఫిర్యాదు చూశాక చాలా మంది కామెంట్లు చేశారు.

ఎందుకంటే ఈ పోస్ట్ కొద్దికాలంలోనే సుమారు 3,000 లైక్స్‌ను పొందింది.

సింగ్ పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వచ్చాయి.ఓ వ్యక్తి సింగ్ ఇంటి పరిమాణం, విద్యుత్ పరికరాల సంఖ్య గురించి ప్రశ్నించారు.విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటే బిల్లు కూడా ఎక్కువగా వస్తుందని, సింగ్ ఈ బిల్లు రెండు నెలలదో కాదో కూడా స్పష్టంగా చెప్పలేదని అన్నారు.

అంటే బిల్లు ఒక్క నెలదే అని అనుకునేలా ఉందని వారి ఉద్దేశ్యం.మరో యూజర్ అయిన రాధిక సింగ్ సోలార్ ప్యానెళ్లను( Solar Panels ) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఆమె మూడు సంవత్సరాల క్రితం సోలార్ ప్యానెళ్లు వాడుకోవడం ప్రారంభించారని, నగరంలో ఎండ ఎక్కువగా ఉన్నా తన విద్యుత్ బిల్లు దాదాపుగా 0 వచ్చిందని, తన అనుభవాన్ని పంచుకున్నారు.

మరొక వ్యక్తి కూడా సౌర ప్యానెళ్లను వాడటమే మంచిదని సూచించారు.ఒకేసారి కాస్త ఖర్చు పెట్టినా, సౌర ప్యానెళ్ల వల్ల భవిష్యత్తులో విద్యుత్ బిల్లుపై చాలా డబ్బు ఆదా అవుతుందని, తాము కూడా సోలార్ ప్యానెళ్లు వాడటం వల్ల చాలా సంతృప్తిగా ఉన్నామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube