పాపం పురంధరేశ్వరి .. అందుకే పదవి దక్కలేదా ? 

రాజమండ్రి ఎంపీ , ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggubati purandeswari ) కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.

 Purandhareshwari That's Why She Didn't Get The Post, Ap Bjp, Daggupati Purandare-TeluguStop.com

ఆ తర్వాత బిజెపిలో చేరడం,  ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఆమెకు బిజెపి అధిష్టానం అవకాశం ఇవ్వడం,  ఇటీవల ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో పురందరేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు.  కానీ, ఆమెకు ఆ అవకాశం దక్కలేదు.

శ్రీకాకుళం టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకి, మరో టిడిపి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు , బిజెపికి చెందిన నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు.

Telugu Ap Bjp, Bhupathiraju, Central, Cm Chandra Babu, Kishan Reddy, Sapuram Mp,

టిడిపికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ ( Pemmasani Chandra sekhar )సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన పురందరేశ్వరి కి మంత్రి పదవి దక్కలేదనే ప్రచారం జరిగింది .అయితే బిజెపిలోని కీలక నేతలు కొందరు పురందరేశ్వరికి మంత్రి పదవి దక్కకుండా మోది, అమిత్ షా వద్ద లాబియింగ్ చేసి సక్సెస్ అయ్యారట.అయితే ఏపీలో ఎన్నికలకు ముందు నుంచే, ఈసారి ఎంపీగా పురందరేశ్వరి విజయం సాధిస్తే ఆమె కచ్చితంగా కేంద్రమంత్రి అవుతారని అంతా భావించారు .ఎందుకంటే ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు.తెలంగాణలో బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కడం తో అదే ఫార్ములాను పురందరేశ్వరి విషయంలోనూ బిజెపి పెద్దలు అనుసరిస్తారని అంతా భావించారు.

  కానీ మొదటిసారిగా నరసాపురం నుంచి విజయం సాధించిన బిజెపి ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు క్యాబినెట్ పదవి దక్కింది.

Telugu Ap Bjp, Bhupathiraju, Central, Cm Chandra Babu, Kishan Reddy, Sapuram Mp,

కేంద్ర మంత్రి పదవి దక్కకపోయినా,  పురందరేశ్వరికి స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.మహిళా కోటాలో స్పీకర్ గా పురందేశ్వరికి అవకాశం కల్పిస్తున్నారనే ప్రచారం జరిగింది.  కానీ  ఓం బిర్ల స్పీకర్ కావడంతో పురందరేశ్వరి కి అవకాశం దక్కలేదు.

దీంతో పురందరిశ్వరి వర్గీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube