ఢిల్లీలో ముగిసిన జీవన్ రెడ్డి అసంతృప్తి .. త్వరలోనే కీలక పదవి 

ఇటీవల కాలం లో కాంగ్రెస్ లో వలసలు జోరు అందుకోవడం  ఉత్సాహాన్ని కలిగిస్తున్నా… ఆ చేరికలు మాత్రం నియోజకవర్గ నేతల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రేపుతున్నాయి.ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు చేరుతుండడంతో,  నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.

 Jeevan Reddy To Continue In Congress Party Details, Congress Mlc, Jeevan Reddy,-TeluguStop.com

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే , రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని,  ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన నేతలు ఆందోళన చెందుతున్నారు .ఇదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం అసంతృప్తికి గురయ్యారు.జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని( MLA Sanjay Kumar ) కాంగ్రెస్ లో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి( Jeevan Reddy ) తప్పుపట్టారు.ఈ వ్యవహారంపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కడం తో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్థాను అంటూ హడావుడి చేశారు.

Telugu Aicc, Congress Mlc, Jagityalmla, Jeevan Reddy, Kc Venugopal, Mallubhatti,

జీవన్ రెడ్డి రాజీనామా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో( Telangana Congress ) పెద్ద సంచలనమే రేపాయి.ఆయనను బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రులు రంగంలోకి దిగినా,  ఆయన మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరించారు .ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీధర్ బాబు,  ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జీవన్ రెడ్డి ప్రయత్నించారు.ఆయన మాత్రం ఈ చేరికల పై ఆగ్రహంగానే ఉన్నారు.

  ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానం కు చెందిన నేతలు ఈ వ్యవహారంలో రంగంలోకి దిగారు.ఈ మేరకు కేసి వేణుగోపాల్ ,( KC Venugopal ) దీపా దాస్ మున్షీ  జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు.

Telugu Aicc, Congress Mlc, Jagityalmla, Jeevan Reddy, Kc Venugopal, Mallubhatti,

ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించడంతో ఢిల్లీకి( Delhi ) జీవన్ రెడ్డి వెళ్లారు.ఇప్పటికే అక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి,  శ్రీధర్ బాబు  లు జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు.  అనంతరం హై కమాండ్ పెద్దలు జీవన్ రెడ్డికి కీలక పదవిని ఇస్తామనే హామీ కూడా కాంగ్రెస్ కమాండ్ పెద్దలు ఇవ్వడం,  తదితర పరిణామాలతో జీవన్ రెడ్డి తన అలకను వీడారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube