ఎన్టీఆర్ తన భార్య బసవతారకం కోసం చేసిన ఈ ఒక్క పని, ఈ రోజు వేల మంది ప్రాణం కాపాడుతుంది

ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి సినీ కెరీర్ లో ఎన్నో అజరామరమైన చిత్రాలు ఉన్నాయి.జానపదాలు, ఇతిహాసాలు, పౌరాణికాలు, సాంఘీకాలలో ఆయన చేయని ప్రయోగం లేదు.

 Sr Ntr Love Towards His First Wife Basavatarakam, Balakrishna, Jr Ntr, Chandraba-TeluguStop.com

సినిమా కోసం ఇంతలా కష్టపడ్డారు కాబట్టే.ఆయన ఈనాటికీ తెలుగునాట ‘ఎదురు లేని మనిషి’.
అలాంటి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కెరీర్ లో ‘మేజర్ చంద్రకాంత్’ మూవీ మాత్రం చాలా ప్రత్యేకం.మిగతా చిత్రాలలా సీనియర్ యన్టీఆర్ ఈ మూవీని తన సొంత లాభం కోసం చేయలేదు.ఒక మంచి ఆశయాన్ని నిర్వర్తించడానికి ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో నటించారు యన్టీఆర్.1982లో సీనియర్ యన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు.
అక్కడ నుండి మెల్లగా సినిమాలో నటించడం తగ్గిస్తూ వచ్చారాయన.ఇక ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 7 ఏళ్ళ కాలంలో కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే యన్టీఆర్ నటించారు.

వీటిలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సామ్రాట్ ఆశోక్’ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.దీనితో.ఇక తారక రామారావుకి వయసు అయిపోయిందన్న టాక్ కూడా వినిపించింది.ఆయన సినిమాల నుండి వైదొలగడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు.

సరిగ్గా అలాంటి సమయంలో యన్టీఆర్ నుండి ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది. బసవతారకం పేరుతో ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టడానికి డబ్బులు కావాలి.

ఆ డబ్బు కోసం తాను .బయట బ్యానర్ లో ఒక సినిమా చేయడాకి సిద్ధంగా ఉన్నానని యన్టీఆర్ పబ్లిక్ గా చెప్పేశారు.

Telugu Balakrishna, Chandrababu, Jr Ntr, Nt Ramara Rao, Srntr-Movie

దీనితో.నిర్మాతలు యన్టీఆర్ ఇంటి ముందు క్యూ కట్టారు.వీరిలో స్టార్ హీరో, కమ్ నిర్మాత మోహన్ బాబు.కూడా పక్క రోజు ఉదయాన్నే అన్నగారి ఇంటి ముందు వాలిపోయాడు.తన తమ్ముడి లాంటి మోహన్ బాబుకే యన్టీఆర్ ఆనందంగా డేట్స్ ఇచ్చాడు.యన్టీఆర్, మోహన్ బాబు కాంబినేషన్ కోసం పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన కథ సిద్ధం చేశారు.

ఒకవైపు యన్టీఆర్ కి మాత్రం సినిమా జయాపజయాల మీద శ్రద్ద లేదు.ప్రజలకి మేలు చేయడానికి, క్యాన్సర్ హాస్పిటల్ కట్టించడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది అంతే.

అదే చాలు అనుకున్నారు.

Telugu Balakrishna, Chandrababu, Jr Ntr, Nt Ramara Rao, Srntr-Movie

కానీ., రాఘవేంద్రరావు, మోహన్ బాబు కసిగా సినిమాని తెరకెక్కించారు. ‘మేజర్ చంద్రకాంత్’ విడుదల అయ్యింది.

సినిమా అంతా దేశభక్తి.అన్నగారి డైలాగులకు థియేటర్స్ లో ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు.

ఇక సినిమా అంతా ఒక ఎత్తు.పుణ్యభూమి నా దేశం పాట ఒక్కటే ఒక ఎత్తు.

ఆ పాటలో యన్టీఆర్ గెటప్స్ కి అభిమానులు నీరాజనాలు పట్టారు.మహిళలు హారతులు ఇచ్చారు.

ఫలితం సినిమా సూపర్ హిట్.ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ పుట్టుకొచ్చాయి.

మోహన్ బాబు అన్నగారి ముందు బ్లాంక్ చెక్ పెట్టారు.ఆయన మాత్రం తనకి రెమ్యూనరేషన్ గా ఎంత రావాలో అంతే తీసుకున్నారు.

అలా వచ్చిన డబ్బుని యన్టీఆర్ క్యాన్సర్ హాస్పటిల్ కట్టించడానికి ఉపయోగించారు.ఇది ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా వెనకున్న చరిత్ర.

ఇలా., రీల్ లైఫ్ పరంగా మాత్రమే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా యన్టీఆర్ కి మధురానుభూతులను మిగిల్చిన చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube