ఒక్క ప్లాప్ తో నిర్మతలు పోయారు.. సినిమాలు పోయాయి..అయోమయంలో కిరణ్ అబ్బవరం పరిస్థితి ?

ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఒకవైపు బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోల పోటీని తట్టుకుంటూ నిలదొక్కుకుంటున్న చిన్న హీరోలు చాలామంది ఉన్నారు అని చెప్పాలి.ఇప్పటికే విజయ్ దేవరకొండ క్రేజీ పాపులారిటీతో ఇండస్ట్రీ ని ఊపేస్తూ ఉండగా.

 Kiran Abbavaram Situation Damaged , Kiran Abbavaram, Sr Kalyanamandapam, Sammath-TeluguStop.com

మరికొంత మంది హీరోలు కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు.

మొదటి సినిమాతోనే టాలెంట్ను నిరూపించుకున్నాడు.అదృష్టం కూడా వెన్నంటే ఉంది.

దీంతో ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

అయితే మొదటి సినిమా హిట్ అయింది కానీ ఆ తర్వాత మాత్రం అదే రేంజ్ లో అదృష్టం కలిసి రావడం లేదు.

వెరసి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు కిరణ్ అబ్బవరం.యాక్షన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నేను మీకు బాగా తెలిసిన వాడినీ అనే చిత్రం రిలీజ్ అయింది.అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా హల్ చల్ చేయలేక పోయింది ఈ సినిమా.

ఊహించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు.ఒకసారి వివరాలు చూసుకుంటే.

నేను మీకు బాగా తెలుసు సినిమా 2nd డే కలెక్షన్స్ :  నైజాం 0.44 కోట్లు,సీడెడ్ 0.41 కోట్లు, ఉత్తరాంధ్ర 0.25 కోట్లు, ఈస్ట్ 0.14 కోట్లు, వెస్ట్ 0.15 కోట్లు, గుంటూరు 0.14 కోట్లు, కృష్ణా 0.15 కోట్లు, నెల్లూరు 0.14 కోట్లు, ఏపీ + తెలంగాణలో 2nd డే కలెక్షన్స్ 1.81 కోట్ల షేర్ రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే.3.63 కోట్లు మాత్రమే వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.15 కోట్లు.టోటల్ వరల్డ్ వైడ్ గా 2nd డే కలెక్షన్స్ 1.97 కోట్ల షేర్ ను కలెక్ట్ చేస్తే.ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే 2nd డే కలెక్షన్స్ రూ.3.98 కోట్లను కొల్లగొట్టింది.

Telugu Kiran Abbavaram, Kiranabbavaram, Sammathama, Tollywood-Telugu Stop Exclus

ఈ కలెక్షన్స్ చూస్తే నష్టాలే వచ్చాయి అని అర్థమవుతుంది.దీంతో యువ హీరో కిరణ్ పై ఒత్తిడి పెరిగింది.నిర్మాతలు ఇప్పటికే అతన్ని పట్టించుకోవడం మానేశారు.ఫ్లాప్ హీరో అనే పేరును మూటగట్టుకున్నాడు.ఇక ఈ చిత్రం కన్నా ముందు సెబాస్టియన్ సినిమా సైతం ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.ఆ తర్వాత వచ్చిన సమ్మతమే సినిమా సైతం కిరణ్ కి నిరాశనే మిగిల్చింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం పరిస్థితి ఇలా ఉంది, మరో విషయం ఏంటి అంటే కిరణ్ అబ్బవరం చేతిలో మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయ్.అవి వినరో భాగ్యము వీర కథ, మీటర్, రూల్స్ రంజాన్.

అయితే ముందు సినిమాల ఫలితం చూసినా ప్రొడ్యూసర్లు కిరణ్ పేరు చెప్తేనే పారిపోతున్నారట, మరి రానున్న కాలంలో ఈ పరిస్థితి మారుతుందా లేదా వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube