ఒకే సారు అంటూనే ... 'కారు ' దిగేందుకు ఆ ఎమ్మెల్యేల స్కెచ్ ? 

రెండుసార్లు తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ( BRS party )మూడోసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవిచూసింది.  ఇక అప్పటి నుంచి గడ్డు పరిస్థితులనే బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది.

 Brs Mla S Joins Ruling Congress In Telangana , Brs Party, Revanth Reddy, Pcc Ch-TeluguStop.com

బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు.ఇక నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు , మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.

Telugu Aicc, Brs Mlas, Brs, Kcr Brs Mlas, Malla, Pcc, Revanth Reddy, Ts-Politics

 ఈ వలసల జోరు కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు ఒకపక్క లీగల్ టీం ప్రయత్నిస్తూనే ఉంది.మరోవైపు పార్టీ మారే ఆలోచనతో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారనే సంకేతాలతో ఎమ్మెల్యేలతో కేసీఆర్( KCR ) సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని,  భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని,  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని కెసిఆర్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

Telugu Aicc, Brs Mlas, Brs, Kcr Brs Mlas, Malla, Pcc, Revanth Reddy, Ts-Politics

కేసిఆర్ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరవుతూనే తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని చెబుతూ , మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.బీఆర్ఎస్ఎల్పీ విలీనంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుండడంతో , కెసిఆర్ సైతం అలర్ట్ అయ్యారు.ఎవరూ తొందరపడి పార్టీని వీడొద్దని కెసిఆర్ చెబుతున్న మాటలకు అంగీకారం తెలుపుతూనే,  మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మంగళవారం నిర్వహించిన సమావేశానికి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి , ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి , జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లు బుధవారం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు .మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి,  సుధీర్ రెడ్డిలు కెసిఆర్ తో సమావేశానికి హాజరైనా కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube