కల్కి సినిమా రివ్యూ: నాగ్ అశ్విన్ విజువల్ వండర్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటించిన కల్కి 2898 ఏడీ( Kalki 2898ad ) సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే పలు షోలు పూర్తి అయ్యాయి.సుమారు 600 కోట్లు బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా చేరుకుందా ప్రభాస్ కల్కి ద్వారా ప్రేక్షకులను మెప్పించారా? లేదా ? ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.

 Kalki Movie Review And Rating Details Inside, Nag Ashwin, Prabhas, Kalki Movie,-TeluguStop.com

కథ:

కల్కి 2898 ఏడీ సినిమా కథ మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్ధం నుంచి మొదలవుతుంది.కురుక్షేత్రంలో కృష్ణుడి నుంచి శాపం పొందిన అశ్వత్థామ, కల్కి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.కల్కి సుమతి అనే మహిళ కడుపున జన్మించబోతున్నారని తెలిసి అశ్వత్థామ ఆ సుమతికి రక్షకుడిగా నిలుస్తారు.

కాంప్లెక్స్ అనే మరో ప్రపంచంలోకి వెళ్లడానికి ఒక మిలియన్ యూనిట్ల కోసం వెతుకుతున్న భైరవకు సుమతిని కనుక తీసుకువస్తే ఆ యూనిట్లు తనకు దక్కుతాయి.మరి బైరవ అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చారా? సుప్రీం యస్కిన్ ఎవరు? మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంతో ఈ కలియుగ అంతం ఎలా ముడిపడి ఉంది అనే ఈ విషయాలన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Telugu Kalki, Kalki Review, Kalki Telugu, Kamal Haasan, Nag Ashwin, Prabhas, Tol

నటీనటుల నటన:

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ( Nag Aswin ) ఈ సినిమాలోని పాత్రలకు సరైన నటీనటులను ఎంపిక చేశారని చెప్పాలి.ఇక ప్రభాస్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు ఈ సినిమాలో తెరపై ప్రభాస్ తనలో ఉన్న మరో నటన నైపుణ్యాన్ని బయటపెట్టారు.ఇక దీపిక పదుకొనే తన పాత్రకు 100% నయం చేసారు.ఇక కమల్ హాసన్, అమితాబ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఇందులో దుల్కర్ విజయ్ దేవరకొండ పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

టెక్నికల్:

కల్కి సినిమా చూస్తే ఈ సినిమా ఒక రెండు సినిమాలు చేసిన డైరెక్టర్ తీశారు అంటే ఎవరు నమ్మరు.ఆయన విజినరీకి హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.నాగ్ అశ్విన్ టేకింగ్, ప్రజెంటేషన్ చూస్తే ఎవరైనా సలాం కొట్టాల్సిందే.ఇలా రెండు సినిమాలు చేసిన డైరెక్టర్ కు అశ్వినీ దత్ స్వయాన మామ అయినప్పటికీ ఆయనను నమ్మి 600 కోట్లు బడ్జెట్ పెట్టడం అంటే నిర్మాత డేర్ చేశారనే చెప్పాలి.సంతోష్ నారాయణ మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి విభాగం 100కు 100% పని చేసే సినిమాని విజయవంతం చేశారు.

Telugu Kalki, Kalki Review, Kalki Telugu, Kamal Haasan, Nag Ashwin, Prabhas, Tol

విశ్లేషణ:

కల్కి లాంటి సినిమాలు మనం ఇదివరకు హాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే చూసి ఉంటాము అలాంటిది ఈ సినిమా మన భారతీయ సినిమా అది తెలుగు తెరపై చూడటం అంటే ప్రేక్షకులకు కాస్త అయోమయంగా ఉంటుంది.ఫస్ట్ కొద్ది నిమిషాల పాటు కథ స్లోగా సాగిన సెకండ్ హాఫ్ నుంచి నాగ్ అశ్విన్ ప్రేక్షకులను చూపు పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశారు.సెకండ్ ఆఫ్ తర్వాత ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కురుక్షేత్రం సినిమాకి హైలైట్ గా నిలిచింది మొత్తానికి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని డైరెక్టర్ ప్రేక్షకులకు పరిచయం చేశారని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్: నా

గ్ అశ్విన్, కథ స్క్రీన్ ప్లే, హాలీవుడ్ విజువల్స్, ప్రభాస్, అమితాబ్, కమల్, కురుక్షేత్రం సీన్స్.

Telugu Kalki, Kalki Review, Kalki Telugu, Kamal Haasan, Nag Ashwin, Prabhas, Tol

మైనస్ పాయింట్స్:

మొదటి 40 నిమిషాలు కథ స్లోగా సాగడం, దీపికా పదుకొనే ( Deepika Padukone )డబ్బింగ్, ఎమోషనల్ సన్నివేశాలు కనెక్ట్ కాకపోవడం.

Telugu Kalki, Kalki Review, Kalki Telugu, Kamal Haasan, Nag Ashwin, Prabhas, Tol

బాటమ్ లైన్:

కల్కి సినిమా ఇండియన్ సినిమాలకు గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు.టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ లో సినిమా చూడాలనుకునేవారు తప్పనిసరిగా ఈ సినిమాని చూస్తూ ఆ అనుభూతిని పొందవచ్చు.మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా హాలీవుడ్ రేంజ్ ను తలదన్నే సినిమా రావటం నిజంగా గర్వకారణం.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube