అమ్మవారి దీక్షలో ఉంటూ చెప్పులు వేసుకున్న పవన్.. ఆ మాత్రం తెలియదా అంటూ ట్రోల్స్!

సినీ నటుడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాలలో చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉన్నారు.ఇలా మంచిగా ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వారాహి అమ్మవారి( Vaarahi Ammavaaru ) దీక్ష వేసుకొని కనిపించిన సంగతి మనకు తెలిసిందే.

 Netizens Trolled About Pawan Kalyan Wear Slippers In Varahi Deeksha Details,pawa-TeluguStop.com

ఈనెల 25న ఈయన దీక్ష వేశారు.ఇలా 11 రోజులపాటు ఈ దీక్షలో ఉండబోతున్నారని వెల్లడించారు.

ఇలా అమ్మవారి దీక్ష వేసుకోవడంతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈయన ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు.ఇక ఈ 11 రోజులు ఎలాంటి ఆహారం కూడా తీసుకోవట్లేదని కేవలం పండ్లు ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటూ అమ్మవారి దీక్షలో ఉంటున్నారని తెలుస్తుంది.

Telugu Controversy, Deputycm, Pawan Kalyan, Pawankalyan, Slipper, Sri Reddy, Var

నిత్యం వైట్ అండ్ వైట్ లో కనిపించే పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అమ్మవారి దీక్షలో కనిపించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా తాజాగా అమ్మవారి దీక్షలో ఉన్నటువంటి ఈయన పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్నారు.సాధారణంగా ఎవరైనా స్వామి వారి దీక్షలో ఉన్నప్పుడు చెప్పులు( Slippers ) ధరించరు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పులు వేసుకోవడంతో పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్నారు.

Telugu Controversy, Deputycm, Pawan Kalyan, Pawankalyan, Slipper, Sri Reddy, Var

ఇక ఇదే విషయాన్ని అదునుగా తీసుకున్న కొంతమంది వైసీపీ నేతలు అభిమానులు పవన్ పై విమర్శలు కురిపిస్తున్నారు.అమ్మవారి దీక్షలో ఉంటూ చెప్పులు వేసుకోవడం అంటే హిందూ మతాన్ని అగౌరవపరిచినట్లేనని, దీక్షలో ఉన్న సమయంలో చెప్పులు వేసుకోకూడదనే విచక్షణ కూడా పవన్ కళ్యాణ్ కు లేదు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.ఇక ఈ విషయంపై శ్రీ రెడ్డి( Sri Reddy ) స్పందిస్తూ.

బీజేపీని మెప్పించడానికా? చెప్పుతో దీక్షలు.వాట్ ఏ హిందూ ఫాలోవర్ అంటూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube