సాధారణంగా మొటిమలు( Pimples ) వచ్చాయి అంటే రెండు రోజుల్లో తగ్గిపోతుంటాయి.కానీ కొందరికి మొటిమలు వారం రోజులైనా అలాగే ఉంటాయి.
వీటిని మొండి మొటిమలు అంటారు.ఇవి తీవ్రమైన నొప్పిని కలగ చేస్తుంటాయి.
చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి.ఇటువంటి మొటిమలు మిమ్మల్ని కూడా వేధిస్తున్నాయా.? ఎన్ని చేసినా అవి మిమ్మల్ని వదలట్లేదా.? డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే ఎలాంటి మొండి మొటిమలు అయినా రెండు రోజుల్లో దెబ్బకు పరార్ అవుతాయి.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక టమాటో( Tomato )ను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే నాలుగు రెబ్బలు వేపాకును కడిగి పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు మరియు వేపాకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్( Rice Flour ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఈ హోమ్ రెమెడీని రోజుకు ఒకసారి కనుక పాటిస్తే ఎలాంటి మొండి మచ్చలు అయినా సరే క్రమంగా మాయం అవుతాయి.అలాగే మొటిమలు తాలూకు మచ్చలు( Acne Scars ) సైతం దూరం అవుతాయి.కాబట్టి మొండి మొటిమలతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
క్లియర్ స్కిన్ ను మీ సొంతం చేసుకోండి.