జమిలి ఎన్నికలపై చాలా కాలంగా హడావుడి జరుగుతూనే ఉంది.ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో కేంద్ర బిజెపి ప్రభుత్వం ( BJP Govt )జమిలి ఎన్నికలను 2024 లోనే నిర్వహించాలని భావించి దీనికి సంబంధించిన కసరత్తు మొదలు పెట్టింది .
ఈ మేరకు లా కమిషన్ ను ఏర్పాటు చేసింది .అయితే 2024 లో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, 2029 నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణ కోసం లా కమిషన్ ఓ ప్రతిపాదన లు జరుగుతుందని సూచిస్తూ , కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ అనేక సూచనలు చేసింది.జమిలి ఎన్నికల సాధ్య సాధ్యలపై మరిన్ని సంప్రదింపులు అవసరమని, దీనిపై తుది నివేదిక ఇవ్వాలంటే మరిన్ని సంప్రదింపులు జరపాలని, దీనిపై తుది నివేదిక ఇచ్చేందుకు మరిన్ని సంప్రదింపులు జరపాలని లా కమిషన్ పేర్కొంది.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో పాటు , అనేక అంశాలపై చర్చించేందుకు లా కమిషన్ చైర్మన్ రీతు రాజ్ ( Law Commission Chairman Justice Ritu Raj )అవస్తి నేతృత్వంలో ఈనెల 27న భేటీ అయింది.ఈ భేటీలో ఏఏ అంశాలపై చర్చించారనేది తెలియాల్సి ఉంది.తాజాగా లా కమిషన్ తన సూచనలు కేంద్ర ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం.
కేంద్రం జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకురాగానే వివిధ రాష్ట్రాల్లోనూ దానికి సంబంధించిన హడావుడి జరిగింది.ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి .ఈ ఎన్నికలపై కొన్ని పార్టీలు సానుకూలంగా ఉండగా, మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి.

అయినా కేంద్రం 2024 లో జమిలి ఎన్నికలు ( Jamili elections )నిర్వహించాలనే పట్టుదలతో ఉండగా, తాజాగా లా కమిషన్ ( Law commission )సూచనలతో 2029 వరకు జెమిని ఎన్నికలు జరిగే అవకాశం లేనట్టుగానే అర్థమవుతోంది. జమిలి ఎన్నికల అంశంతో పాటు ఫోక్సొ చట్టం ప్రకారం లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకరించే కనీస వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనను లా కమిషన్ వ్యతిరేకించింది.దీనిపై కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది.







